India Vs New Zealand Semi Final
India Vs New Zealand Semi Final: వరల్డ్ కప్ 2023 చివరి దశకు చేరుకుంది. భారత జట్టు ఫైనల్ బెర్త్ ఖరారైంది. భారత్‌తో తలపడేది ఎవరు అనేది కొన్ని గంటల్లో తేలిపోనుంది. సెమీఫైనల్‌లో భాగంగా వాంఖడే వేదికగా ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌కి భారీ ఆదరణ లభించింది. స్టేడియం మొత్తం కిక్కిరిసిపోగా, టీవీలలో, హాట్ స్టార్‌లలో వీక్షకులు ఎగబడి చూశారు. ఈ మ్యాచ్‌తో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) డిజిటల్ బ్రాడ్‌కాస్టర్ డిస్నీహాట్ స్టార్ సరికొత్త చరిత్ర సృష్టించింది. తొలి సెమీఫైనల్లో హాట్‌స్టార్ రికార్డు రియల్ టైమ్ వ్యూస్‌ను రాబట్టింది. ఈ మ్యాచ్‌ను హాట్‌స్టార్‌లో 5.1 కోట్ల మంది ప్రేక్షకులు వీక్షించడంతో సరికొత్త వరల్డ్ రికార్డు నమోదైంది.
గత రికార్డు బ్రేక్..
కొన్ని రోజుల కిందట ధర్మశాల వేదికగా ఇండియా-కివీస్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌ని గరిష్టంగా 4.30 కోట్ల మంది వీక్షించారు. ఈ రికార్డు తాజాగా బద్ధలైంది. విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్ నమోదు చేయడం హాట్‌స్టార్‌కు బాగానే కలిసి వచ్చింది. విరాట్ కోహ్లీ 50వ సెంచరీ పూర్తయిన క్షణాన హాట్‌స్టార్ రియల్ టైమ్ వ్యూస్ 5 కోట్లకు చేరడంతో సరికొత్త రికార్డ్ నమోదు అయింది. సెంచరీ కొట్టిన తర్వాత కోహ్లీ మోకరిల్లి సచిన్‌కి అభివాదం చేయడం, తన సతీమణి అనుష్క వైపు చూస్తూ సంబరాలు చేసుకుంటున్న సమయంలో హాట్‌స్టార్ రియల్ టైమ్ వ్యూస్ 5 కోట్లకు చేరింది. ఈ మ్యాచ్ ఆసాంతం వూ‍్యస్ 4 కోట్లకు తగ్గకపోవడం మరో విశేషం. ఇదే వన్డే ప్రపంచకప్‌లో భారత్-సౌతాఫ్రికా మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో గరిష్టంగా 4.4 కోట్ల రియల్ టైమ్ వ్యూస్ రాగా, దానిని సెమీస్ మ్యాచ్ బ్రేక్ చేసింది.
ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌తోనే..
అయితే ఇంత భారీ రియల్‌టైమ్ వ్యూస్ రావడానికి ప్రధాన కారణం హాట్ స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ మరో కారనం. వరల్డ్ కప్ మ్యాచ్‌లన్నీ ఉచితంగా చూసే అవకాశం కల్పించడంతో మొదట పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇండియా ఓటమెరుగని వరుస విజయాలతో క్రమంగా వీక్షకుల సంఖ్య బాగా పెరుగుతూ వచ్చింది. సెమీ ఫైనల్స్‌లో పీక్‌కు చేరింది. ఏ షాపులో చూసినా, ఎక్కడ చూసినా… మొబైల్స్‌లో సెమీ ఫైనల్ మ్యాచ్ చూస్తున్నవాళ్లే కనిపించారు. హాట్ స్టార్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం, మ్యాచ్ ఎంచక్కా ఎంజాయ్ చేయడం కనిపించింది. జియో బ్రాడ్‌బ్యాండ్ ప్యాకేజీలతో హాట్ స్టార్ ఫ్రీ స్ట్రీమింగ్ ఫలితంగా రియల్ టైమ్ వ్యూస్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. ఇక సండే రోజు ఈ రికార్డు కూబా బద్ధలు కావడం ఖాయం.
సమష్టిగా భారత్ విజయం..
ఇక సెమీ ఫైనల్‌లో భారత్ సమష్టిగా రాణించడంతో 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఏడు వికెట్లతో చెలరేగిన(7/57) మహమ్మద్ షమీ న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు. విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ శతకాలు బాదడంతోపాటు మొదట్లో రోహిత్ శర్మ, చివరలో కేఎల్.రాహుల్ విజృంభించడంతో భారత్ 397 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ విజయంతో 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఎదురైన పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: India vs new zealand semi final hotstar who created history in the semi final broke the previous record
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com