Modi vs KCR: తనకు మాలిన ధర్మం మరొకటి ఉండదంటారు. ఇఫ్పుడు కేసీఆర్ ‘కాళేశ్వరం’ అవినీతిని ఫోకస్ చేస్తున్న బీజేపీకి అదే అవినీతితో కొట్టాలని కేసీఆర్ డిసైడ్ అయ్యాడు.అందుకే సరికొత్త పల్లవి అందుకున్నారు. కేంద్రమంత్రుల అవినీతి చట్టా తన దగ్గర ఉందని.. మోడీ ఘనకార్యాలన్నీ బయటపెడుతానని హెచ్చరికలు మొదలుపెట్టారు. నిజానికి మోడీతో పెట్టుకున్న వాళ్లందరిపై ఇప్పటికే ఐటీ, ఈడీ దాడులు జరిగేవి.కానీ కేసీఆర్ జోలికి మాత్రం ఇంకా కేంద్రం దిగడం లేదు. ఈసారి వీళ్లద్దరి ఫైట్ యమ రంజుగా ఉంది. తన అవినీతిని బయటపెడితే మోడీ సర్కార్ బండారం బయటపెడుతానని కేసీఆర్ నిన్న కొత్త ట్విస్ట్ ఇచ్చాడు.మరి కేంద్రమంత్రుల అవినీతిపై నిజంగానే ఆధారాలున్నాయా? కేసీఆర్ బయటపెడుతాడా? మోడీ సర్కార్ ను ఇరుకునపెడుతాడా? అన్న దానిపై స్పెషల్ ఫోకస్..

‘‘బీజేపీ పాలనపై దేశం మొత్తం తీవ్ర నిరాశలో ఉంది… ముఖ్యంగా తెలంగాణపై అక్కసు వెల్లగక్కుతోంది..రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఆపేస్తూ ప్రజలను వంచిస్తోంది.. కేంద్రంపై పోరాడడానికి అవసరమైతే ఢిల్లీలో పోరాటం చేస్తాం.. ఏనిమిదేళ్లు వేచి చూసినా ఆయనలో మార్పు రాలేదని, ఇక సహించేంది లేదని’’ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై వరుసగా విమర్శలు చేస్తున్న కేసీఆర్ ఆదివారం సైతం ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ మాటల దాడి చేశాడు. ముందుగా కేంద్ర మంత్రులు ఏ రంగంలో అవినీతి చేశారో అందుకు సంబంధించిన వివరాలు తమ దగ్గర ఉన్నాయని, మొత్తంగా మోడీ చేసిన ఘనకార్యాలన్నీ ఓ పుస్తక రూపంలో రాశారని అందుకు సంబంధించిన పుస్తకాన్ని విడుదల చేశారు. వాటిని అక్కడున్న వారందరికీ పంచారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ విద్యుత్ వ్యవస్థను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని అన్నారు. నరేంద్ర మోదీకి విరాళాలు అందించిన వారికి ఈ వ్యవస్థను అప్పజెప్పాలని చూస్తున్నారని అన్నారు. విద్యుత్ సంస్కరణలు చేపడుతున్నామని చెబుతున్నప్పటికీ 77 శాతం సంపదను కొంత మందికి లాభం చేకూర్చేందుకు మోదీ యత్నిస్తున్నారని ఆరోపించారు. ఇలా విద్యుత్ వ్యవస్థను ప్రైవేటీకరణ చేస్తే రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతారని అన్నారు. విద్యుత్ ను ప్రైవేటీకరణ చేస్తే చార్జీలు పెరుగుతాయని, మోదీ అసలు రంగును త్వరలో బయటపెడుతామని కేసీఆర్ విమర్శించారు. సంస్కరణల్లో భాగంగా తెలంగాణలో సబ్సిడీలను ఎత్తివేయాలని కండిషన్లు పెట్టారని అన్నారు. ఇలా చేస్తే పేద ప్రజలను ఏమైపోతారని కేసీఆర్ ప్రశ్నించారు. జలవిద్యుత్ ను ఆపేసి సౌర విద్యుత్ ను కొనుగోలు చేయాలని కేంద్రం షరతు పెడుతుందని కేసీఆర్ ఫైర్ అయ్యారు.
ఇటీవల ప్రకటించిన బడ్జెట్లో కేంద్రం దళితులకు అన్యాయం చేసిందని విమర్శించారు. దేశంలోని 40 వేల కోట్ల మంది దళితులు ఉన్నప్పటికీ బడ్జెట్లో కేవలం 12 వేల కోట్లు కేటాయించారని, ఇదివారికి అన్యాయం చేసినట్లే కదా..? అని అన్నారు. ఇక కిషన్ రెడ్డి తనకు బడ్జెట్ పై అవగాహన లేదని అంటున్నారని, అయితే అయితే కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నవారు మర్యాదగా మాట్లాడాలని, మరోసారి ఇలా మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. అటు రాష్ట్రానికి రావాల్సిన గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటి నిధుల్లో కోత విధించారని ఆరోపించారు. దీంతో రాష్ట్రంలో పేద ప్రజలకు కూలీ లేకుండా పోతుందని కేసీఆర్ అన్నారు.
2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ఇప్పటి వరకు ఏ స్థాయిలో అభివృద్ధి చేశారో చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఎన్ఎస్ఈ చెప్పిన లెక్కల ప్రకారం ఉపాది, పారిశ్రామిక రంగంలో ఏ సాధించారో తెలిసిపోతుందని విమర్శించారు. నరేంద్ర మోదీ అభివృద్ధి అంతా వాట్సాప్ లోనే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. దేశంలో 12 శాతం అభివృద్ధి ఉందని అంటున్నారు.. అదెలాగో చూపించాలని ప్రశ్నించారు. నిజంగా 12 శాతం వృద్ధి సాధిస్తే దేశం ఈ పరిస్థితుల్లో ఎందుకుంటుందని అన్నారు. బీజేపీ పాలనలో దేశంలో సర్వ నాశనం అవుతుందని కేసీఆర్ అన్నారు.
తనపై ఈడీ, సీబీఐ కేసులు పెడుతామని బెదిరిస్తున్నారని, అలాంటి వాటికి కేసీఆర్ భయపడరని అన్నారు. మోదీ చిట్టా అంతా తన వద్ద ఉందని అన్నారు. రఫేల్ డీల్ లో వేల కోట్లు బీజేపీ ప్రభుత్వం మింగేసిందని, తాము వాళ్లనే లోపలేస్తామని హెచ్చరించారు. మోదీ హయాంలో 22 మంది బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోయారన్నారు. జైలంటే దొంగలకు భయమని తనకు కాదని కేసీఆర్ అన్నారు.

[…] Also Read: మోడీపై ఈసారి కేసీఆర్ టార్గెట్ ఇదే! […]