Homeలైఫ్ స్టైల్Zodiac signs: ఈ రాశుల వారికి జీవితం లో ప్రేమ పెళ్లి సెట్ అవ్వవు... అందులో...

Zodiac signs: ఈ రాశుల వారికి జీవితం లో ప్రేమ పెళ్లి సెట్ అవ్వవు… అందులో మీరు ఉన్నారేమో చూడండి!

Zodiac signs: ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ పెళ్లి అనేది ఏదో ఒక సందర్భంలో జరిగే సంఘటన.అయితే కొందరి జీవితంలో మాత్రం వారు పెళ్లి చేసుకోవాలన్న వారిని ప్రేమించి పెళ్లి చేసుకునే వ్యక్తులు ఎవరు దొరకరు. ఇలా పెళ్లి కుదిరక ఎంతోమంది జీవితంలో పెళ్లి చేసుకోకుండా ఉండిపోతున్నారు. ఈ క్రమంలోనే కొందరి రాశి చక్రం ప్రకారం వారి జీవితంలో ప్రేమ పెళ్లి అనే వాటికి ఏ మాత్రం చోటు ఉండదు. మరి ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇక్కడ తెలుసుకుందాం…

Zodiac signs
Zodiac signs

మేష రాశి: మేష రాశి వారికి జీవితంలో ఇతర సంబంధాలతో పాటు ప్రతి ఒక్కరి విషయంలోనూ ఎంతో నిర్లక్ష్యంగా ఉంటారు. కనుక వీరి జాతకంలో స్థిరమైన సంబంధాలను కలిగి ఉండడంలో విఫలమవుతారు.

వృషభం: వృషభ రాశి వారికి కూడా జీవితంలో వారి బంధాలను బంధుత్వాలను బలపరుచుకోవడంలో పూర్తిగా విఫలం అవుతారు. వీరు వీరి జీవిత భాగస్వామి నుంచి రావలసిన వాటి గురించి పెద్ద మొత్తంలో ఆశిస్తారు కనుక వీరి బంధం ఎప్పటికీ నిలబడదు.

మిధునం: మిధున రాశి వారు ఏ విషయాలలోనైనా సాహసం, సహజత్వాన్ని ఇష్టపడతారు కనుక ఇలాంటి వారు మిధున రాశి వారి జీవిత భాగస్వామిగా ఎన్నుకో కూడదు. ఇలా ఇబ్బంది వ్యక్తిత్వం కలవారు వారి జీవితంలో ముందుకు సాగలేరు.

కర్కాటకం: కర్కాటకం రాశిచక్ర గుర్తులు సంబంధాలను కొనసాగించడం చాలా కష్టతరం చేస్తాయి. ఈ జ్యోతిష్యులు ఎంత ప్రయత్నించినా వీరికి సంబంధాలు కుదరవు ఒకవేళ కుదిరిన వాటిని బలపరచుకోలేరు.

సింహం:సింహరాశి వారు వారి జీవిత భాగస్వామి నుంచి శ్రద్ధ ప్రేమను కోరుకుంటారు. వీరు ఎంత కష్టమైన వారి బంధాన్ని నిలుపుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.

కన్య: కన్యరాశి వారు వారి జీవిత భాగస్వామి సంతోషంగా ఉండటం కోసం ఏం చేయడానికైనా ప్రయత్నిస్తారు. జీవిత భాగస్వామి పట్ల సరైన అవగాహన ఉండడమే కాకుండా ఎంతో దయాగుణం కలిగిన వ్యక్తులుగా పేరు పొందుతారు.

తుల: ఈ రాశివారు వారి జీవిత భాగస్వామి నుంచి ఏదైనా ఉదారంగా ప్రత్యేకమైనది రావాలని ఆశిస్తారు. ఈ రాశివారు ఇవ్వడం తీసుకోవడం విధానాన్ని ఇష్టపడతారు.

Also Read: కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వానికి బీజేపీ డెడ్ లైన్

వృశ్చికం: వృశ్చికరాశి వారు వారి జీవిత భాగస్వామి నుంచి ఎంతో ఆశిస్తారు ఇలా ఆశించినది జీవిత భాగస్వామి నుంచి రాక పోవడంతో వారిని వదిలి పెట్టడానికి కూడా వెనకాడరు.

ధనస్సు: ధనస్సు రాశి వారు ప్రతి విషయంలోనూ ఎంతో మొండిగా బద్ధకంగా వ్యవహరిస్తారు. ఈ రాశివారు తమను తాము విశ్వసించడం చాలా కష్టం, ఇది వారి బంధానికి ఇబ్బందిగా మార్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి.

Also Read: హోదా రగిలింది..వైసీపీ ఏం చేస్తుంది?

మకరం: మకర రాశి వారు ఎంతో సున్నితంగా ఉంటారు అలాగే జీవిత భాగస్వామి పట్ల ఎంతో ప్రేమగా మెలుగుతారు. అయితే వీరు వీరి చుట్టూ ఉన్న సౌకర్య పరిస్థితిని విడిచి పెట్టడానికి భయపడుతుంటారు. ఈ రాశి వారు ఎంతో రొమాంటిక్ పర్సన్ అని చెప్పవచ్చు.

కుంభం: కుంభరాశి సంబంధాలు విషయానికి వస్తే వీరు ఎంతో నిజాయితీగా ప్రేమగా ఆనందంగా ఉంటారు.ఈ రాశి వారు జీవిత భాగస్వామిని ఆనందంగా సురక్షితంగా ఉంచడం కోసం ఎంత కష్టమైనా ఆ కష్టాన్ని ఎదుర్కొంటారు.

మీనం: మీన రాశి వారు ఎక్కువగా మూఢనమ్మకాలను విశ్వసిస్తారు ఇతరులకన్నా వీరి వారి సొంత ఇబ్బందులకు భావోద్వేగాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. మీన రాశి వారు వాస్తవిక పరిస్థితులను ఎదుర్కోలేరు.

కాంగ్రేసేతర కూటమికి బీజం..? కేసీఆర్, స్టాలిన్ కు మమత ఫోన్
కేసీఆర్ పైనా బీజేపీది అదే సర్జికల్ స్ట్రైక్
ప్రత్యేక హోదా’ ఆ ఎన్నిక కోసమేనా?
తెలంగాణ‌లో కాంగ్రెస్ ఉనికి ప్ర‌శ్నార్థ‌క‌మేనా?

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version