Homeఅంతర్జాతీయంNarendra Modi Israel Visit: మోదీకి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ఇజ్రాయెల్‌ ప్రధాని.. ఇంతకీ ఏం చేశాడో...

Narendra Modi Israel Visit: మోదీకి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ఇజ్రాయెల్‌ ప్రధాని.. ఇంతకీ ఏం చేశాడో తెలుసా?

Narendra Modi Israel Visit: భారత ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఫిబ్రవరి 25న ఇజ్రాయెల్‌ వెళ్లారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నవేళ.. మోదీ ఇజ్రాయెల్‌ పర్యటన అందరిలోనూ ఆసక్తి చేపుతోంది. రెండు రోజుల పర్యటనలో మోదీ ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహుతో పలు కీలక అంశాలపై చర్చింబోతున్నారు. అయితే ఇజ్రాయెల్‌ చేరిన భారత ప్రధానికి బుధవారం ఘన స్వాగతం లభించింది. మోదీ ఇజ్రాయెల్‌ పర్యటన సన్నివేశాన్ని మరింత స్నేహపూర్వకంగా మలిచింది. ఈ సందర్భంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఇచ్చిన సర్‌ప్రైజ్‌ రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే సంకేతంగా మారింది.

Also Read: లోకేష్ తలచుకుంటే అంతే!

స్నేహ బంధానికి ప్రతీక
పర్యటనలో భాగంగా జరిగిన బుధవారం రాత్రి భోజనానికి ముందు నెతన్యాహు భారతీయ సాంప్రదాయ వస్త్రాలు ధరించి మోదీని కలిశారు. ఇది సాధారణ, అఫీషియల్‌ పర్యటనా కాకుండా వ్యక్తిగత స్నేహానికి ప్రతీకగా నిలిచింది. మోదీతో కలిసి ఉన్న వీడియోను నెతన్యాహూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఇందులో ç ‘నా స్నేహితుడు మోదీ కోసం ఈ వస్త్రాలు ఎంచుకున్నాను‘ అని చెప్పడం ద్వారా ఇరు దేశాత మధ్య సత్సంబంధాలను ప్రత్యేకంగా నిలిపింది. ఇరు దేశాల ప్రధానుల మధ్య సాంస్కృతిక గౌరవానికి ప్రతీకగా నిలిచింది.

పార్లమెంట్‌ ప్రసంగం
ఇదిలా ఉంటే మోదీ ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ (క్నెసెట్‌)ను ఉద్దేశించి ప్రసంగించిన మొదటి భారత ప్రధానిగా చరిత్ర సృష్టించారు. ఈ ప్రసంగంలో ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో రెండు దేశాల సమన్వయాన్ని బలపరిచారు. ఇది భారత్‌–ఇజ్రాయెల్‌ సహకారానికి కొత్త ఆవిష్కరణలు తీసుకురావచ్చనే ఆశను నింపుతుంది.

ద్వైపాక్షిక బంధం బలోపేతం..
ఈ సంఘటనలు రెండు దేశాల మధ్య డిప్లొమసీని కొత్త ఎత్తులకు చేర్చాయి. సాంస్కృతిక, ద్వైపాక్షిక, రాజకీయ చర్చలను మరింత బలోపేతం చేస్తుంది. భవిష్యత్తులో రక్షణ, సాంకేతికత వంటి రంగాల్లో మరిన్ని ఒప్పందాలు ఆశించవచ్చు. మోదీ పర్యటన భారత్‌కు మధ్యప్రాచ్యంలో కొత్త స్థానాన్ని ఇస్తుందని నిపుణులు అంచనా.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version