KCR and BJP: దేశంలో మూడో కూటమి రావాల్సిన అవసరం ఏర్పడిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. బీజేపీ పాలనలో దేశం తిరోగమనంలో పోవడంతోనే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకమైందని గుర్తు చేస్తున్నారు. బీజేపీయేతర పక్షాలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం అందరిని కలుపుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాల నేతలు స్టాలిన్, విజయన్, మమతా బెనర్జీ, తేజస్వి యాదవ్ తదితరులతో చర్చించిన కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.
ఇటీవల కాలంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా విభేదాలు పెరిగిపోయాయి. రెండు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలకు దిగుతున్నారు. ప్రధాని మోడీ నియంతృత్వ విధానాలతోనే దేశం అధోగతి పాలవుతోందని విమర్శలకు దిగుతున్నారు. కేంద్రం తనను భయపెడుతోందని ఆరోపించారు. తనను జైలుకు పంపుతామని బెదరిస్తున్నారని చెబుతున్నారు. దీంతో కేసీఆర్ మూడో కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రజాఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలు గుర్తిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే దేశంలో బీజేపీయేతర పాలన రావాలని ప్రజల్లో ఆకాంక్షలు పెరుగుతున్నట్లు అవకాశాలు కనిపిస్తున్నాయనేది ఆయన వాదన. దీంతో దీని కోసమే అందరి ఏకాభిప్రాయంతో ప్రజాఫ్రంట్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి దేశంలోని బీజేపీ, కాంగ్రెసేతర పక్షాలతో జట్టు కట్టేందుకు ముందుకు కదులుతున్నారు.
ఈ నేపథ్యంలో కేసీఆర్ తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రజాఫ్రంట్ ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రధాని మోడీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఎక్కడ చూసినా బీజేపీ నేతలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టి వారిని ఇక ఉపేక్షించేది లేదని చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే కేసీఆర్ కు భయం పట్టుకుందని పలువురు వాదిస్తున్నారు. బీజేపీ నేతలు పదేపదే కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని చెబుతున్న సందర్భంలో కేసీఆర్ లో రోజురోజుకు భయం పెరిగిపోతోందని తెలుస్లోంది.
దీంతోనే ఆయన బీజేపీపై విరుచుకు పడుతున్నట్లు సమాచారం. భవిష్యత్ లో కేసీఆర్ చేసిన తప్పులకు తగిన ప్రతిఫలం తప్పదని హెచ్చరికలు వస్తున్న సందర్భంలోనే కేసీఆర్ లో సహనం కోల్పోతున్నట్లు బీజేపీ నేతలు కూడా చెబుతున్నారు. దీంతోనే కేసీఆర్ కు భవిష్యత్ లో కష్టాలు తప్పవని తెలుస్తోంది. బీజేపీతో ఇక ఢిల్లీలోనే తేల్చుకుంటామని కేసీఆర్ పదేపదే చెబుతున్నారు. బీజేపీ అవినీతి చిట్టా తన వద్ద ఉందని దాన్ని బయటపెట్టి బీజేపీతో ఇక కయ్యం తప్పదని హెచ్చరికలు జారీ చేయడం చూస్తుంటే ఆయనలో భయం బాగా పెరిగిపోయిందని పలువురు విశ్లేషిస్తున్నారు.
Also Read: Kcr vs Modi: కేసీఆర్ లో నిజంగానే భయం పట్టుకుందా?