https://oktelugu.com/

చంద్ర గ్రహణం సమయంలో చేయాల్సిన పనులు ఇవే..?

హిందువులు కార్తీక పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారని మనందరికీ తెలిసిందే. అయితే సాధారణంగా వచ్చే కార్తీక పౌర్ణమికి ఈ ఏడాది వచ్చే కార్తీక పౌర్ణమికి చిన్న తేడా ఉంది. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి, చంద్రగ్రహణం ఒకేరోజున రావడం గమనార్హం. కార్తీకదీపం రోజున పూజలు, దానాలు, అధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. కార్తీక పౌర్ణమితో పాటు చంద్ర గ్రణం వల్ల ఈ సంవత్సరం వచ్చిన కార్తీక పౌర్ణమి ప్రత్యేకం అని చెప్పవచ్చు. Also Read: […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 27, 2020 / 07:00 AM IST
    Follow us on


    హిందువులు కార్తీక పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారని మనందరికీ తెలిసిందే. అయితే సాధారణంగా వచ్చే కార్తీక పౌర్ణమికి ఈ ఏడాది వచ్చే కార్తీక పౌర్ణమికి చిన్న తేడా ఉంది. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి, చంద్రగ్రహణం ఒకేరోజున రావడం గమనార్హం. కార్తీకదీపం రోజున పూజలు, దానాలు, అధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. కార్తీక పౌర్ణమితో పాటు చంద్ర గ్రణం వల్ల ఈ సంవత్సరం వచ్చిన కార్తీక పౌర్ణమి ప్రత్యేకం అని చెప్పవచ్చు.

    Also Read: రేపు కంగారులతో భారత్ ఢీ

    ఈ సంవత్సరం ఏర్పడే గ్రహణాల్లో ఇదే చివరి చంద్రగ్రణం కావడంతో ఈ గ్రహణంకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా ఈ చంద్ర గ్రహణం కనిపిస్తుంది. గ్రహణం అనే పదం వింటే కొందరు గ్రహణం వల్ల మంచి జరుగుతుందని మరి కొందరు గ్రహణం వల్ల చెడు జరుగుతుందని భావిస్తూ ఉంటారు. చంద్రుడు నల్లబడటానికి ముందే గ్రహణం ముగుస్తుందని ఉపఛాయ గ్రహణమని అంటారు.

    Also Read: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ..?

    సోమవారం రోజు మధ్యాహ్నం 1 : 04 నుండి సాయంత్రం 5 : 22 వరకు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణం సమయంలో మంత్రాలు జపించి ధ్యానం చేయాలి. గ్రహణం సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. ఒకవేళ ఆహారం తీసుకుంటే ఆ తరువాత మూడురోజుల పాటు ఉపవాసం ఉండాలి. గ్రహణం సమయంలో నిద్రపోవడం, భాగస్వామితో కలవడం,జంతువుల మీద కూర్చోవడం చేయకూడదు.

    మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం: జనరల్

    చంద్రగ్రహణం సమయంలో దేవుడిని జపిస్తూ పూజలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. గ్రహణం సమయంలో బ్రహ్మదండు చెట్టు తెచ్చుకుని ఇంటి గుమ్మానికి కడితే కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.