100th Test : దిగ్గజ ఆటగాళ్లే.. వందో టెస్ట్ లో అశ్విన్ తో సహా “సున్నా”ను మూటగట్టుకున్నారు

దిలీప్ వెంగ్ సర్కార్ 1988లో ముంబైలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో డక్ ఔటయ్యాడు. అతడికి అది 100 టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. ఆస్ట్రేలియా కి చెందిన దిగ్గజ బ్యాటర్ బోర్డర్ 1991 లో వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా 100వ టెస్టు మైలు రాయి అందుకున్నాడు. ఆ మ్యాచ్లో అతడు 0 పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు.

Written By: NARESH, Updated On : March 8, 2024 10:05 pm
Follow us on

100th Test : వాళ్లు దిగ్గజ ఆటగాళ్లు. బ్యాట్ తో మెరిశారు. బంతితో ఇరగదీశారు. జట్లకు చిరస్మరణీయ విజయాలు అందించారు. చరిత్రలో తమకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నారు. కానీ 100వ టెస్ట్ మైలురాయికి చేరుకున్నప్పుడు అత్యంత చెత్త రికార్డు నమోదు చేసుకున్నారు.. శుక్రవారం ఇంగ్లాండ్ జట్టుతో ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదవ టెస్టులో టీమిండియా ఏస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ డక్ ఔట్ అయ్యాడు.. హార్ట్ లీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ 101 ఓవర్ లో 428 పరుగుల వద్ద రవిచంద్రన్ అశ్విన్ హార్ట్ లీ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 100వ టెస్టులో చెత్త రికార్డును తన పేరు మీద నమోదు చేసుకున్నాడు. అంతకుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ నాలుగు వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్ లో భాగంగా రెండవ రోజు ఆటలో ఐదు బంతులు ఆడిన అశ్విన్ ఒక్క పరుగు చేయకుండానే పెవిలియన్ చేరడంతో అభిమానులు నిరాశలో మునిగిపోయారు.

మూడో ఆటగాడు

100వ టెస్టులో డక్ అవుట్ అయిన ఆటగాళ్లలో అశ్విన్ మూడవ ఆటగాడు. అంతర్జాతీయ స్థాయిలో ఎనిమిదవ ఆటగాడు. అంతర్జాతీయ స్థాయిలో 100 టెస్ట్ ఆడుతూ డక్ అవుట్ అయిన వారి జాబితాలో.. భారత్ తరఫున ఇన్నాళ్లు దిలీప్ వెంగ్ సర్కార్, చతేశ్వర్ పూజారా ఉండేవారు. ధర్మశాలలో హార్ట్ లి బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అవ్వడం ద్వారా అశ్విన్ ఆ జాబితాలో మూడవ భారత ఆటగాడయ్యాడు..

ఇతర ఆటగాళ్ల జాబితా పరిశీలిస్తే..

దిలీప్ వెంగ్ సర్కార్ 1988లో ముంబైలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో డక్ ఔటయ్యాడు. అతడికి అది 100 టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. ఆస్ట్రేలియా కి చెందిన దిగ్గజ బ్యాటర్ బోర్డర్ 1991 లో వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా 100వ టెస్టు మైలు రాయి అందుకున్నాడు. ఆ మ్యాచ్లో అతడు 0 పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. వెస్టిండీస్ ఆటగాడు కొట్నీ వాల్స్.. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 100వ టెస్ట్ మైలురాయి అందుకున్నాడు. ఆ మ్యాచ్లో అతడు 0 పరుగులకే వెనుతిరిగాడు. ఆస్ట్రేలియాకు చెందిన మార్క్ టేలర్ 1998లో ఇంగ్లాండ్ జట్టుతో గబ్బా మైదానం వేదికగా జరిగిన మ్యాచ్ ద్వారా 100వ టెస్టు మైలురాయి అందుకున్నాడు. అయితే ఆ మ్యాచ్ లో అతడు పరుగులేమీ చేయకుండా ఔటయ్యాడు. న్యూజిలాండ్ ఆటగాడు స్టీఫెన్ ఫ్లెమింగ్ 2006లో సెంచూరియన్ వేదికగా సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్ ద్వారా తన 100వ టెస్టు మైలురాయి అందుకున్నాడు. అయితే అతడు ఆ మ్యాచ్ లో డక్ అవుటయ్యాడు. న్యూజిలాండ్ కు చెందిన బ్రెండన్ మెక్ కల్లమ్ 2016లో ఆస్ట్రేలియాతో వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మ్యాచ్ ద్వారా 100వ టెస్టు మైలురాయి అందుకున్నాడు. అయితే అతడు ఆ మ్యాచ్లో పరుగులేమీ చేయకుండానే వెనుతిరిగాడు. ఇంగ్లాండ్ దేశానికి చెందిన అలిస్టర్ కుక్ 100వ టెస్టులో 0 పరుగులకే అవుట్ అయ్యాడు. భారత జట్టుకు చెందిన పూజారా కూడా తన 100వ టెస్టులో సున్నా పరుగులకే ఔటయ్యాడు. ఆస్ట్రేలియాతో ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్ ద్వారా తన కెరీర్లో 100వ టెస్ట్ ఆడిన పూజారా డక్ ఔట్ అయ్యాడు. ఇప్పుడు ఈ జాబితాలో భారత ఏస్ స్పిన్నర్ అశ్విన్ కూడా చేరాడు.