Radhika Merchant
Radhika Merchant: ప్రపంచ కుబేరుల్లో టాప్ టెన్‌లో.. ఆసియాలో నంబర్ వన పొజిషన్‌లో ఉన్నారు భారత్‌కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అబానీ. వ్యాపారరంగంలో తిరుగులేని సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న ముకేశ్ అంబానీ ఇటీవల తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లిని అంగరంగ వైభంగా జరిపించారు. దాదాపు ఆరు నెలలపాటు ఈ పెళ్లి వేడుక సాగింది. సుమారు 5 వేలు కోట్ల రూపాయలు ఇందుకోసం ఖర్చు చేశారు. భారత దేశంలో ఇప్పటి వరకు ఎవరూ చేయనంత గొప్పగా పెళ్లి జరిపించారు. ఇక అంబానీ ఇంట కోడలిగా అడుగుపెట్టింది రాధిక మర్చంట్. అయితే ఈ రాధిక మర్చంట్ ఎవరు అన్నది చాలా మందికి తెలియదు. రాధిక మర్చంట్ ఎవరి కూతురు. ముకేశ్ అంబానీ వియ్యంకుడు ఎవరు.. ఆయన నేపథ్యం ఏమిటి.. పెళ్లి సంబంధం ఎలా కుదిరింది అనే వివరాలు తెలుసుకుందాం.
ఎంకోర్ హెల్‌కేర్ వ్యవస్థాకుల కూతురు..
అపర కుబేరుడి ఇంటికి కోడలిగా వచ్చిన రాధిక మచ్చంట్ ఎంకోర్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకులు, యజమానులుగా ఉన్న వీరేన్ మర్చంట్ – శైలా మర్చంట్ దంపతుల చిన్న కుమార్తె. రాధిక తండ్రి ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈవో, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్, స్టీల్ తయారీ సంస్థ బోర్డు సభ్యుడు, శైలా మర్చంట్ ఎన్‌కోర్ హెల్త్ కేర్ డైరెక్టర్‌గా ఉన్నారు. అంబానీ ఇంట్లోకి చిన్న కోడలిగా అడుగుపెట్టిన రాధిక మర్చంట్ ఫ్యామిలీ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఆమె సోదరి అంజలి మర్చంట్ గురించి తెలిసి ఆశ్చర్యపోతున్నారు.
రాధిక ఉన్నత విద్యావంతురాలు..
రాధిక మర్చంట్ తన పాఠశాల విద్యను కేథడ్రల్, జాన్ కానన్ స్కూల్, ఎకోల్ మొండియల్ వరల్డ్ స్కూల్‌లో చదివారు. రాధిక బీడీ సోమాని ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ఇంటర్నేషనల్ బాకలారియేట్ డిప్లొమా కూడా పొందారు. న్యూయార్క్ యూనివర్సిటీ నుండి పొలిటికల్ సైన్స్‌లో గ్రాడ్యుయేట్ చేశారు.
కంపెనీలో ఉద్యోగం..
భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత రాధిక మర్చంట్ ఇస్ప్రవా అనే లగ్జరీ రియల్ ఎస్టేట్ కంపెనీలో చేరారు. ఒక సంవత్సరం పనిచేశారు. తర్వాత ఆమె ఎన్‌కోర్ హెల్త్‌కేర్‌కు వెళ్లింది. రాధిక భరతనాట్యంలో శిక్షణ కూడా పొందింది. 2022 జూన్‌లో రాధిక మర్చంట్ ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో తన ‘అరంగేట్రం’ (మొదటి దశ ప్రదర్శన) ప్రదర్శించారు.
చిన్ననాటి స్నేహితులే..
ఇదిలా ఉంటే రాధిక మర్చంట్, అనంత్ అంబానీ చిన్ననాటి స్నేహితులు. అంబానీ నివాసానికి రాధిక తరచుగా అతిథిగా వచ్చేది. 2018లో ఆనంద్ పిరమల్‌తో ఇషా అంబానీ వివాహానికి, 2019లో ఆకాశ్–శ్లోకా వివాహానికి కూడా హాజరయ్యారు.
రాధిక అక్క అంజలి..
రాధిక మర్చంట్ అక్క అంజలి మర్చంట్ తన కుటుంబ వ్యాపార సామ్రాజ్యంలో కీలకపాత్రలు పోషిస్తుంది. తండ్రి విరేన్ మర్చంట్ ఫార్మా కంపెనీలో కీలకపాత్ర పోసిస్తున్నారు. ఈహెచ్‌ఎల్‌పీ కంపెనీలో మొదట్లో జనరల్ మేనేజర్ – బిజినెస్ డెవలప్‌మెంట్‌గా చేరి, తర్వాత మేనేజర్ – మార్కెటింగ్, క్లయింట్ ఔట్రీచ్ ఎగ్జిక్యూటివ్‌గా రాణించారు. 2021లో ఈహెచ్‌ఎల్‌పీ అభివృద్ది, విస్తరణ స్ట్రీరింగ్ చేయడంలో ఆమె ఆలోచనలతో సుస్థిరం చేయగా.. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకరిగా మారారు. అలాగే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రంగంలోకి అడుగుపెట్టింది. మైలూన్ మెటల్స్ స్థాపించి అలియా భట్, టబు వంటి ప్రముఖులచే ప్రోత్సహించబడిన హెయిర్ స్టైలింగ్, ట్రీట్మెంట్ క్లబ్ సీఈఓగా గుర్తింపు పొందింది.
అంజలి మర్చంట్ చదువు..
ముంబైలోని ది కేథడ్రల్, జాన్ కానన్‌స్కూల్, ఎకోల్ మొండియాల్ వరల్డ్ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆ తర్వాత విదేశాలలో ఉన్న విద్యను అభ్యసించింది. అంజలి మసాచుసెట్స్‌లోని బాబ్సన్ కాలేజీ నుంచి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్‌డిగ్రీ పట్టా పొందింది. లండన్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. విద్యావిషయక కార్యక్రమాలలో ట్రాన్స్‌ఫార్మేటివ్ సెమిస్టర్ ఎట్ సీ ప్రోగ్రామ్ పూర్తి చేసింది. 12 దేశాలలో విభిన్న సంస్కృతుల గురించి అధ్యానయం చేసింది. ఈ అనుభవం గ్లోబల్ ఎకనామిక్స్, లాంగ్వేజెస్, ఇంటర్నేషనల్ స్టడీస్‌పై ఆమె అవగాహనను సుసంపన్నం చేసింది.
అంజలి వ్యక్తిగత జీవితం..
2020లో ప్రముఖ వ్యాపారవేత్త అమన్ మజిథియాను వివాహం చేసుకుంది అంజలి. వీరికి ఒక బాబు ఉన్నాడు. అమన్ మజిథియా ఈహెచ్‌ఎల్‌పీ కంపెనీలో అసోసియేట్ డైరెక్టర్‌గా ఉన్నారు. అలాగే కంపెనీలోని సీఎంవో యూనిట్ కార్యాచరణ అంశాలను చూసుకుంటారు. అంజలి నికర విలువ సుమారు రూ.2 వేల కోట్లకు పైగానే ఉంటుంది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Who is radhika merchant do you know who her parents are
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com