Homeప్రత్యేకంHrithik Roshan Birthday: హృతిక్‌ రోషన్ జర్నీ.. అవమానాల నుంచి కోట్లాది మంది ...

Hrithik Roshan Birthday: హృతిక్‌ రోషన్ జర్నీ.. అవమానాల నుంచి కోట్లాది మంది అభిమానుల వరకూ.. !

Hrithik Roshan Birthday: హృతిక్ రోషన్ పుట్టినరోజు నేడు. ‘గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్’ అంటూ అభిమానులు ఉత్సవాలు జరుపుకుంటున్నారు. నిజంగా హృతిక్ జీవితం నమ్మశక్యం కానిది. అసలు హృతిక్ కి విజయం అంత ఈజీగా రాలేదు. మీకు తెలుసా ? బాల్యంలో నలుగురితో కలవడానికి కూడా హృతిక్ భయపడేవాడు. అసలు నలుగురిలో నోరు తెరవడానికి కూడా ఎంతో ఇబ్బంది పడేవాడు. ఐతే ప్రస్తుతం పేజీల కొద్దీ డైలాగులను అలవోకగా చెప్పగలడు.

Hrithik Roshan Birthday
Hrithik Roshan Birthday

హృతిక్ రోషన్ కి చిన్నతనంలో ఎక్కువగా నత్తి ఉండేది. ఆ నత్తి బాధతో అతను ఎన్నో ఇబ్బందులు, అవమానాలు పడ్డాడు. పైగా అతనికి ఇంకా కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. అయితే ఏం ? పుట్టుకతో వచ్చిన ఆ లోపాలను అణిచి, పట్టుదలతో తిరుగులేని ఆత్మవిశ్వాసంతో వెండితెర పై కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న నిజమైన హీరో హృతిక్ రోషన్.

హృతిక్ రోషన్ బాల్యం !

హృతిక్ కిది సినీ కుటుంబమే. 1974 జనవరి 10న ముంబైలో జన్మించాడు. తండ్రి రాకేష్‌ రోషన్‌.. బాలీవుడ్‌ నటుడు. హృతిక్ తల్లి పింకీ రోషన్‌. సినీ నేపథ్యమున్న కుటుంబం అయినా హృతిక్‌ చిన్నతనంలో ఎప్పుడూ ఒంటరిగా గడపడానికే ఎక్కువగా ఇష్టపడేవాడు. హృతిక్‌ కు ఆరు వేళ్లు, పుట్టుకతోనే కుడిచేతికి అదనపు బొటన వేలుతో పుట్టాడు హృతిక్. ఆ వేలును చూసి పిల్లలు హృతిక్ ను ఆటపట్టిస్తూ ఎగతాళి చేసేవాళ్లు. దీనికితోడు హృతిక్ కి నత్తి, పైగా నిత్యం అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ బాల్యాన్ని గడిపాడు.

Hrithik Roshan Birthday
Hrithik Roshan Birthday

హృతిక్ సినీ కెరీర్ !

హీరో అయిన తొలిరోజుల్లో అసలు హృతిక్ ను హీరోగా భావించేవాళ్ళు కాదు. అయితే, అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు హృతిక్. మీకు తెలుసా ? హృతిక్ తొలి పారితోషికం కేవలం రూ.100. తన ఆరేళ్ల వయసులో 1980లో వచ్చిన ‘ఆశా’ అనే సినిమా కోసం తొలిసారి కెమెరా ముందుకొచ్చాడు.

Hrithik Roshan Birthday
Hrithik Roshan Birthday

ఆ తర్వాత హృతిక్‌ సినిమాల్లోకి రావడానికి ముందు కొంతకాలం తండ్రి రాకేష్‌ రోషన్‌ సినిమాలకు సహాయకుడిగా పనిచేస్తూ.. టీ అందించడం నుంచి ఫ్లోర్‌ తుడవడం వరకు అన్నీ పనులు చేశాడు. అలాగే ఎడిటింగ్, లైటింగ్, కెమెరామెన్ ఇలా అన్ని విభాగాల్లోనూ పనిచేసి సినిమా పై అవగాహన పెంచుకున్నాడు. ఆ తర్వాత హీరోగా అందరి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా కూడా రికార్డు క్రియేట్ చేశాడు.

Also Read: బర్త్ డే లుక్ తో షేక్ చేసిన హృతిక్‌ !

హృతిక్‌ డ్యాన్స్‌ చేయడం కష్టం అన్నారు.

హృతిక్‌ తెర పై డ్యాన్స్‌ చేయడం చూస్తే.. ‘అబ్బ..ఏం చేస్తన్నాడురా.. అసలు ఒంట్లో ఎముకలు ఉన్నాయా ? లేవా ? అని అందరూ ఆశ్చర్య పోతుండేవాళ్లు. కానీ చిన్నతనంలో హృతిక్ కి వెన్నుపూస సమస్య వచ్చింది. డాక్టర్స్ డ్యాన్స్ చేయలేడన్నారు. నేడు బాలీవుడ్‌ కథానాయకుల్లోనే అద్భుతమైన డ్యాన్సర్‌ గా పేరుతెచ్చుకున్నాడు హృతిక్‌. మా ఓకే తెలుగు తరపున హృతిక్‌ కి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు.

Hrithik Roshan Birthday
Hrithik Roshan Birthday

Also Read: ‘బన్నీ’ పై జాన్వీ కపూర్ క్రేజీ కామెంట్స్.. !

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version