https://oktelugu.com/

Pushpa craze: ఖండాంతరాలు దాటుతున్న ‘పుష్ప’ క్రేజ్..!

Pushpa craze: అల్లు అర్జున్ తాజా చిత్రం ‘పుష్ప’ ఇండియాలో కలెక్షన్ల మోత మోగిస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, యూఎస్ అనే తేడా లేకుండా విడుదలైన ప్రతీచోట మంచి వసూళ్లు రాబడుతూ బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ స్టామినాను చూపిస్తోంది. ‘పుష్ప’లో బన్నీ క్యారెక్టర్ హైలెట్ గా నిలువగా రష్మిక మందన్న గ్లామర్, సమంత స్పెషల్ సాంగ్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సుకుమార్ డైరెక్షన్ ‘పుష్ప’కు అడ్వాంటేజ్ గా మారాయి. ‘పుష్ప’లోని సాంగ్స్ యూట్యూబ్లో కొత్త రికార్డులను […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 11, 2022 / 10:54 AM IST
    Follow us on

    Pushpa craze: అల్లు అర్జున్ తాజా చిత్రం ‘పుష్ప’ ఇండియాలో కలెక్షన్ల మోత మోగిస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, యూఎస్ అనే తేడా లేకుండా విడుదలైన ప్రతీచోట మంచి వసూళ్లు రాబడుతూ బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ స్టామినాను చూపిస్తోంది. ‘పుష్ప’లో బన్నీ క్యారెక్టర్ హైలెట్ గా నిలువగా రష్మిక మందన్న గ్లామర్, సమంత స్పెషల్ సాంగ్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సుకుమార్ డైరెక్షన్ ‘పుష్ప’కు అడ్వాంటేజ్ గా మారాయి.

    Pushpa craze

    ‘పుష్ప’లోని సాంగ్స్ యూట్యూబ్లో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. ‘ఊ అంటవా మావా.. ఊఊ అంటవా మావా’ అంటూ సమంత చేసిన స్పెషల్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. అలాగే రష్మిక అర్జున్ లపై తెరకెక్కించిన ‘సామీ సామీ’ సాంగ్ అదే రేంజులో ట్రెండ్ అవుతోంది. ఈ పాటను సోషల్ మీడియాలో ఎంతోమంది సెలబ్రెటీలు రీల్స్, డబ్ స్మాష్ లు చేస్తూ ఆకట్టుకున్నారు.

    Also Read:  ప్రభాస్ ‘ప్రాజెక్ట్‌ కే’ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ !

    ‘సామీ సామీ’ పాట సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఈ సాంగ్ ఇప్పుడు సౌత్ ఇండియా, నార్త్ ఇండియాతోనే కాకుండా ఖండాంతరాలకు పాకింది. ‘సామీ సామీ’ పాటను టాంజానియాకు చెందిన కిలిపాల్ అనే వ్యక్తి అదిరిపోయే స్టెప్పులేసి ఇన్ స్ట్రాలో పోస్టు చేశారు. టాంజానియా సంప్రదాయ వేషాధరణలో కిలిపాల్ చేసిన డాన్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

    ఈ వీడియోకు అల్లు అర్జున్, రష్మిక, టాలీవుడ్, పుష్ప, సామీ సామీ, తెలుగు అనే ట్యాగులను జోడించడం విశేషం. గతంలోనూ కిలిపాల్ పలు ఇండియన్ సినిమా పాటలకు స్టెప్పులేసి అలరించాడు. కాగా కిల్ పాల్ ఇన్ స్ట్రాలో 10లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మొత్తంగా ‘పుష్ఫ’ సామీసామీ ఇప్పుడు విదేశాల్లో ట్రెండ్ అవుతుండటంపై బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

    Also Read: ‘పుష్ప’ కి మరో స్టార్ హీరో ఫిదా.. ఎందుకు అందరూ పుష్ప పై పడ్డారు ?