https://oktelugu.com/

Satyaraj Corona: కట్టప్ప సత్యరాజ్ ఆరోగ్యంపై కీలక ప్రకటన రిలీజ్

Satyaraj Corona:  ప్రముఖ నటుడు సత్యరాజ్ కు కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. మధ్యలో ఆయన ఆరోగ్యం విషమించిందని.. దాంతో వైద్య బృందం ఆయన పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారంటూ రకరకాల వార్తలు వచ్చాయి. పైగా సత్యరాజ్ కి కరోనా ఇన్ ఫెక్షన్ తో తీవ్రంగా ఉందని కూడా పుకార్లు పుట్టించారు. అయితే, భయపడాల్సిన పని ఏమి లేదు. సత్యరాజ్ గారు తాజాగా ఆసుపత్రి […]

Written By: , Updated On : January 11, 2022 / 11:03 AM IST
Follow us on

Satyaraj Corona:  ప్రముఖ నటుడు సత్యరాజ్ కు కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. మధ్యలో ఆయన ఆరోగ్యం విషమించిందని.. దాంతో వైద్య బృందం ఆయన పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారంటూ రకరకాల వార్తలు వచ్చాయి. పైగా సత్యరాజ్ కి కరోనా ఇన్ ఫెక్షన్ తో తీవ్రంగా ఉందని కూడా పుకార్లు పుట్టించారు.

Sathyaraj-Kattapa

అయితే, భయపడాల్సిన పని ఏమి లేదు. సత్యరాజ్ గారు తాజాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాకపోతే చెన్నైలో చికిత్స పొందుతున్న సమయంలో ఓ దశలో నిజంగానే ఆయన ఆరోగ్యం కాస్త క్షీణించిందని.. అయితే, ఆ పరిస్థితి నుంచి సత్యరాజ్ గారు చాలా వేగంగా బయటపడ్డారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.

ఇక సత్యరాజ్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు పూజలు కూడా చేశారు. ‘బహుబలి’లో కట్టప్పగా సత్యరాజ్ అందరికి బాగా దగ్గర అయ్యాడు. దాంతో ‘బాహుబలి’ నటుడికి కరోనా అంటూ నేషనల్ రేంజ్ లో ఈ వార్త వైరల్ అయింది. మొత్తమ్మీద ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కరోనా మూడో వేవ్ కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా నటీనటులకు వరుసగా కరోనా పాజిటివ్ అని వస్తుండటంతో మొత్తానికి పరిస్థితి విషమించింది. దాంతో కరోనా భయం మళ్ళీ మొదలైంది.

నిజానికి మూడో వేవ్ ఇంత వేగంగా వ్యాప్తి చెందుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అన్నట్టు నిన్న ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ శోభన్, ఖుష్బూలకు కూడా కరోనా సోకింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా, తమకు కోవిడ్ సోకిందని వాళ్ళు చెప్పుకొచ్చారు. వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా వస్తోంది.