Pakistan – Imran Khan : రోజు రోజుకీ దిగజారుతున్న పాకిస్తాన్ పరిస్థితి

ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఆర్మీతో రాజీధోరణితో వెళుతున్నాడు. రాజీబేరాలు సాగిస్తున్నారు. దీనిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : May 28, 2023 11:02 pm
Follow us on

Pakistan – Imran Khan : మన పొరుగుదేశం, శత్రుదేశం పాకిస్తాన్ పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతోంది. పాక్ ఆర్థిక సంవత్సరం జూన్ తో ముగుస్తుంది. వారి ఆర్థిక సంవత్సరం జీడీపీ 5శాతం అంచనావేయగా.. అయితే 0.29 శాతానికి ప్రస్తుతం పడిపోయింది. రేపు జూన్ 9 వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. జూన్ నెల పాకిస్తాన్ కు జీవన్మరణ సమస్యగా మారనుంది. విదేశాల నుంచి పాక్ వచ్చే నిధులు ఆగిపోయాయి.. విదేశాల్లోని పాక్ పౌరులు డబ్బులు పాక్ కు పంపడం లేదు. వారి దేశంపై విదేశాల్లోని పాకిస్తానీయులకే నమ్మకం లేకుండా పోయింది.

ఇమ్రాన్ ఖాన్ ఎవరూ చేయని పని చేశాడు. ఆర్మీపైనే తిరుగుబాటు చేశాడు. ప్రతీరోజు ఆర్మీని విమర్శిస్తూ పోస్ట్ చేస్తున్నాడు. ఇమ్రాన్ అరెస్ట్ వేళ పాక్ ఆర్మీ కమాండర్, హెడ్ క్వార్టర్స్ పై దాడి చేశారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను ఏ విధంగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారో చూశాం. ఇన్నాళ్ల నుంచి ఏదో విధంగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళుతూనే ఉన్నారు. కోర్టులకు ఎక్కి తప్పించుకుంటూ వస్తూనే ఉన్నారు. ఎందుకింత గొడవ జరిగింది. ఇమ్రాన్ అరెస్ట్ తో పాకిస్తాన్ అట్టుడికి పోయింది. ఆర్మీ జనరల్ ఇంటి మీదకు, ఐఎస్ఐ చీఫ్ ఇంటి మీదకు వెళ్లి మరీ దాడులు జరిగాయి. ఆర్మీ మీద దాడులు ఎప్పుడూ వినలేదు.

ఇమ్రాన్ ఖాన్ ఒక తిరుగుబాటు ధోరణిని ప్రదర్శిస్తున్నారు. నేను సహకరించను అంటూ ప్రభుత్వానికి తెగేసి చెబుతున్నాడు. మీరు తిరుగుబాటు చేయండి అంటూ తనపార్టీ శ్రేణులు, సానుభూతిపరులను కోరుతున్నారు. ప్రజలను సైతం ఇమ్రాన్ రెచ్చగొడుతున్నాడు.

ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఆర్మీతో రాజీధోరణితో వెళుతున్నాడు. రాజీబేరాలు సాగిస్తున్నారు. దీనిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.