New Parliament Building : ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ.. కొత్త పార్లమెంట్ భవనం ఎలా ఉంది.? దాని విశేషాలు ఏమిటి? లోపల అశోక చక్రం ఎంత గంభీరంగా పెట్టారు? స్పీకర్ వెనుక అశోకుడి ధర్మచుక్రం.. పీకాక్ మోడల్ లో లోక్ సభ, లోటస్ మోడల్ లో రాజ్యసభ.. వీటి మీదనే చర్చల మీద చర్చలు సాగుతున్నాయి. కొత్త పార్లమెంట్ అద్భుతంగా ఉంది. ప్రతి వాళ్లు ఆనందించాల్సిన విషయం..
పార్లమెంట్ కొత్త భవనం విషయంలో కాంగ్రెస్ వాళ్లు చేసే విమర్శలను, వారి బాయ్ కాట్ ను ఎవరూ గుర్తించుకున్న దాఖలాలు లేవు. ఈ కొత్త పార్లమెంట్ ను కట్టాలని కాంగ్రెస్ హయాంలోనే స్పీకర్ మీరాకుమార్ ప్రతిపాదించారు. మోడీ అధికారంలోకి వచ్చాక దాన్ని పట్టాలెక్కించారు. అయితే మోడీకి పేరు రావద్దని ఇలా కాంగ్రెస్ బాయ్ కాట్ వ్యూహం పన్నింది. కానీ కాంగ్రెస్ ను పట్టించుకున్న పాపాన ఎవరూ పోలేదు. కాంగ్రెస్ తీరును ఈసడించుకుంటున్నారు.
ఎవరో బ్రిటీష్ వారు కట్టిన పార్లమెంట్ లోనే మనం ఉంటున్నాం. కానీ మన కొత్త పార్లమెంట్ మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా కట్టుకున్నాం.. మన అస్తిత్వానికి గుర్తుగా మన చిహ్నాలు, రాజ్య ఆయుధాలను పొందుపరుచుకున్నాం. మ్యూజియంలలోని మన చారిత్రక సంపదను ఇందులో పెట్టుకున్నాం. మన సింహాల సింబల్స్, ధర్మచక్రం, ఆర్ట్ ఫ్యాక్ట్స్ మన సంస్కృతి ఉట్టిపడేలా మన నిర్మాణం చేసుకోవడం ఒక నిజంగా పండుగ లాంటిది.
కొత్త పార్లమెంట్ ను బాయ్ కాట్ పిలుపుతో నవ్వుల పాలైన కాంగ్రెస్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.