Malli Pelli OTT: అప్పుడే ఓటీటీలోకి నరేష్ ‘మళ్ళీ పెళ్లి’.. ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందంటే!

ఇంటర్వూస్ లో ఈ చిత్రానికి 15 కోట్ల రూపాయిలు ఖర్చు చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. కానీ వాస్తవానికి 8 కోట్లు కూడా ఖర్చు అయ్యి ఉండదు.డిజిటల్ + సాటిలైట్ రైట్స్ రూపం లో ఆయన ఎప్పుడో సేఫ్ అయిపోయాడు. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసింది.ముందు అనుకున్న రేట్ కంటే ఇప్పుడు ఎక్కువ ఇస్తాము అంటూ ఒక బంపర్ ఆఫర్ తో నరేష్ ముందుకు వచ్చింది అమెజాన్ ప్రైమ్ సంస్థ.

Written By: Vicky, Updated On : May 29, 2023 7:39 am

Malli Pelli OTT

Follow us on

Malli Pelli OTT: సీనియర్ హీరో నరేష్ పవిత్ర లోకేష్ తో నడిపిన ప్రేమాయణం గురించి తీసిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. రీసెంట్ గానే గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ అయితే బాగానే వచ్చాయి కానీ, కలెక్షన్స్ మాత్రం నిల్.మొదటి రోజు ఎదో పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లను సాధించిన, రెండవ రోజు నుండి మాత్రం కనీస స్థాయి వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. ఈ చిత్రాన్ని నరేష్ నటిస్తూ నిర్మించాడు కూడా.

ఇంటర్వూస్ లో ఈ చిత్రానికి 15 కోట్ల రూపాయిలు ఖర్చు చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. కానీ వాస్తవానికి 8 కోట్లు కూడా ఖర్చు అయ్యి ఉండదు.డిజిటల్ + సాటిలైట్ రైట్స్ రూపం లో ఆయన ఎప్పుడో సేఫ్ అయిపోయాడు. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసింది.ముందు అనుకున్న రేట్ కంటే ఇప్పుడు ఎక్కువ ఇస్తాము అంటూ ఒక బంపర్ ఆఫర్ తో నరేష్ ముందుకు వచ్చింది అమెజాన్ ప్రైమ్ సంస్థ.

ముందుగా ఈ చిత్రాన్ని జూన్ 20 వ తారీఖున అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయాలనుకున్నారు, అదే డీల్. అయితే అమెజాన్ ప్రైమ్ సంస్థ థియేటర్స్ లో ఈ చిత్రం రన్ దాదాపుగా రెండవ రోజు నుండి ముగిసిపోవడాన్ని గమనించారు.

థియేటర్స్ లో అయితే ఇలాంటి సినిమాలను ఆడియన్స్ చూడడం కష్టం, కానీ ఓటీటీ లో మాత్రం తప్పక ప్రోత్సహిస్తారు అనే ఉద్దేశ్యం తో జూన్ 4 వ తేదీన ఈ సినిమాని స్ట్రీమింగ్ చేసుకునేందుకు అనుమతిని ఇస్తే, ముందు అనుకున్న రేట్ కంటే 30 శాతం ఎక్కువ ఇస్తాము అంటూ ముందుకు వచ్చారు. నరేష్ ఈ డీల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. అంటే ఈ చిత్రం వచ్చే నెల నాల్గవ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రాబోతుంది అన్నమాట. చూడాలి మరి ఓటీటీ ఆడియన్స్ నుండి ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది.