Tamilisai RK : ప్రతీ ఆదివారం ఒక ప్రముఖుడిని ఇంటర్వ్యూ చేస్తూ వారి గుట్టు మట్లు అన్నీ విప్పదీసే ఏబీఎన్ ఆర్కే ఈసారి కాస్త పెద్ద సెలబ్రెటీనే పట్టుకున్నారు. ఏకంగా తెలంగాణ గవర్నర్ తమిళిసైని ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ అంటూ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆమె వ్యక్తిగత, రాజకీయ జీవితాన్ని తవ్వితీశారు. తమిళనాడులో ఒక డాక్టర్ గా మొదలైన ఆమె ప్రస్థానం రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? ఎలా ఎదిగారన్నది బయటపెట్టించారు.

తమిళనాడులో జన్మించిన తమిళి సై నాన్న కూడా వైద్యుడే అన్న సంగతి బయటపడింది. ఆయన రాజకీయాలపై ఆసక్తితో కాంగ్రెస్ లో చేరాడని.. కాంగ్రెస్ నేతగా ఎదిగాడని తెలిపారు. తాను కూడా కాంగ్రెస్ నుంచే బీజేపీలో చేరి ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగనని తమిళి సై తన చరిత్రను చెప్పుకొచ్చారు.
Also Read: IPL Virat Bad Time: ఐపీఎల్: విరాట్ కోహ్లీకి బ్యాడ్ టైం.. ఇంతటి దుస్థితి ఎప్పుడూ చూడలేదే?
ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానం గుర్తించి తనను తెలంగాణ గవర్నర్ గా పంపించిందని తమిళిసై తెలిపారు. తమిళనాడుకు చెందిన తమిళిసైని తెలంగాణకు పంపించడం వెనుక ఏదైనా మిషన్ ఉందా? అని కూడా ఆర్కే ఆరాతీశారు. అయితే ప్రజాసేవలో తన సేవలు గుర్తించి మాత్రమే తెలంగాణ ప్రజలకు సేవ చేసేందుకు పంపించారని గవర్నర్ కవర్ చేశారు.
అయితే కొద్దిరోజులు బాగానే సాగిందని.. కానీ కేసీఆర్, కేటీఆర్ తనను బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారని.. కేంద్రంలోని బీజేపీకతో అంటకాగుతున్నారని అభాసుపాలు చేశారని తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రోటోకాల్ లేకుండా వ్యవహరిస్తున్నారని.. రిపబ్లిక్ డే నాడు ఒక జెండా ఎగురవేసి పొమ్మన్నారని.. కనీసం టీ కాఫీలు కూడా ఇవ్వలేదని కేసీఆర్ ట్రీట్ మెంట్ ను గవర్నర్ బయటపెట్టారు.
ఇక కేసీఆర్ తో తనకు ఎందుకు చెండిందనే విషయాన్ని తమిళిసై బయటపెట్టారు. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో మాత్రం అది హైడ్ చేశారు. ఏదైనా రాజకీయ కారణంతోనే వీరిమధ్య చెడిందని అనిపిస్తోంది.
కేసీఆర్ ప్రతిపాదించిన ఎమ్మెల్సీలను తమిళిసై రిజెక్ట్ చేయడం వల్లే వీరి మధ్యచెడిందని ప్రచారం సాగుతోంది. హుజూరాబాద్ నేత కౌశిక్ రెడ్డి కేసీఆర్ ప్రతిపాదిస్తే దాన్ని తిరస్కరించడమే కేసీఆర్ ఆగ్రహానికి కారణమన్న వాదన ఉంది. అయితే తమిళిసై ఎందుకు చెడిందన్నది బయటపెట్టారు. అది ఏంటన్నది ఈ ఆదివారం తేలనుంది. ఈ ప్రోమోలో గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలను చూడొచ్చు.
Also Read: Early Elections In AP: ఏపీలో ముందస్తు ఎన్నికలు.. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ మార్పు దేనికి సంకేతం?
[…] Also Read: Tamilisai RK: కేసీఆర్ తో ఎందుకు చెడింది? గవర్న… […]