IPL Virat Bad Time: బండ్లు ఓడలవుతాయి. ఓడలు బండ్లవుతాయి. గాచారం మంచిగ లేకపోతే గడ్డిపోచే పాము అయి కరుస్తుందంటారు. ప్రస్తుతం విరాట్ కోహ్లి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒకప్పుడు అతడి రికార్డులు చూసి ఖంగుతిన్న వారే ఇప్పుడు అతడి ప్రదర్శన చూసి నోరెళ్లబెడుతున్నారు. ఆడాల్సిన మ్యాచుల్లో ఓడుతూ అప్రదిష్ట మూటగట్టుకుంటున్నాడు. అవలీలగా పరుగులు చేసే కోహ్లి ప్ర్తస్తుతం ఫామ్ కొనసాగించలేకపోతున్నాడు. ఫలితంగా కెరీర్ కే మచ్చ వస్తోంది. తోటి క్రికెటర్లు అద్భుతాలు సృష్టిస్తుంటే తాను మాత్రం అలవోకగా ఆడాల్సిన బందులను సైతం తప్పించుకోలేక చివరకు ఔటవుతున్నాడు. తన చెత్త ప్రదర్శనతో జట్టుకు అపఖ్యాతి తెస్తున్నాడు. దీంతో అతడిని ఏ జట్టులోనూ ఉంచుకోని పరిస్థితి.

Virat Kohli
ఒకప్పుడు సచిన్ రికార్డులు సైతం బద్దలు కొట్టే సత్తా ఉన్న ఆటగాడిగా రికార్డులు మోత మోగించాడు. ఇండియాకు దొరికిన ఆణిముత్యం అంటూ వేనోళ్ల పొగిడారు. కానీ ప్రస్తుతం అతడి ఫామ్ కొనసాగించలేకపోతున్నాడు. పూలమ్మిన చోట కట్టెలమ్మాల్సి రావడం బాధాకరమే. మంచి పేరు తెచ్చుకున్న చోటే అపఖ్యాతి మూటగట్టుకోవడం దారుణం. ఒంటి చేత్తో జట్టును గెలిపించే సత్తా కలిగిన ఆటగాడిగా కోహ్లికి పేరున్నా ప్రస్తుతం అందరితో కలిసి కూడా ఆటడం లేదు ఫలితంగా త్వరగా ఔటవుతూ విమర్శలకు అవకాశమిస్తున్నాడు. సులభంగా గెలవాల్సిన మ్యాచులను చేజార్చుతూ నిర్వాహకులతో సైతం తిట్లు తింటున్నాడు.
Also Read: Vijayanagaram District: ఆ జిల్లాలో అధికార పార్టీకి షాకిస్తున్న నేతలు.. ఎందుకలా?
పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో అనుకోకుండా అవుటై మరోమారు వివాదాస్పదంగా మారాడు. బ్యాట్ ఝుళిపించాల్సిన సమయంలో అకస్మాత్తుగా ఔటవుతూ తనలోని శక్తి యుక్తులకు చెడ్డ పేరు తెస్తున్నాడు. వేగంగా ఆడే కోహ్లి నెమ్మదిగా ఆడుతున్నా త్వరగా వికెట్ల వద్ద దొరికిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో విరాట్ భవితవ్యం ఏమిటనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. విరాట్ లో మునుపటి సత్తా లోపిస్తోందని చెబుతున్నారు. గతంలో బ్యాట్ పడితే అంతే పరుగులు రావాల్సిందే. వరద పారాల్సిందే. ప్రత్యర్థి జట్టు కంగారు పడాల్సిందే. కానీ ప్రస్తుతం విరాట్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూస్తుంటే బాధ కలుగుతోంది.

RCB Vs Punjab
ఈ పరిస్థితుల్లో విరాట్ కోహ్లిలో వచ్చిన మార్పులేంటి? ఎందుకు తడబడుతున్నాడు? ఒంటి చేత్తో మ్యాచులు గెలిపించిన ఆటగాడిగా పేరు పొందినా ఎందుకు ప్రస్తుతం ఆ స్థాయిలో ఆడటం లేదు. మ్యాచ్ ఏదైనా తన చేతికి పని చెప్నడమే కావాలి. కానీ ప్రస్తుతం విరాట్ స్థితికి అందరు జాలి పడుతున్నారు. ఆట తీరులో పస లేదని చెబుతున్నారు. ఇంకా ఏదో కావాలని ప్రేక్షకులు ఆరాట పడుతున్నా అతడు మాత్రం తన ఆటతీరు మెరుగు పరుచుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో విరాట్ భవితవ్యం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి.
Also Read: Mahesh Babu Hard work: మహేష్ కష్టమంతా వృధా.. ఇది ఫ్యాన్స్ కి వ్యథే !