https://oktelugu.com/

గుండెపోటు వచ్చిన యజమానిని కాపాడిన కుక్క.. ఎలా అంటే..?

ఈ భూమిపై ఉండే జంతువుల్లో కుక్క విశ్వాసం ఉన్న జంతువు అనే సంగతి తెలిసిందే. తాజాగా ఒక కుక్క యజమానికి గుండెపోటు వస్తే అతని ప్రాణాలను కాపాడి అతడిపై విశ్వాసం చూపించింది. గుండె పోటు వల్ల గిలగిలలాడుతున్న యజమాని సృహ కోల్పోకుండా చేయడంతో పాటు అతను ఆంబులెన్స్ కు ఫోన్ చేసేలా చేసి ప్రాణాలను రక్షించింది. యజమానిని కాపాడిన కుక్క గురించి నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు ఆ కుక్క తెలివిని ప్రశంసిస్తున్నారు. Also Read: బెగ్గర్లకు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 6, 2021 4:35 pm
    Follow us on

    Dog

    ఈ భూమిపై ఉండే జంతువుల్లో కుక్క విశ్వాసం ఉన్న జంతువు అనే సంగతి తెలిసిందే. తాజాగా ఒక కుక్క యజమానికి గుండెపోటు వస్తే అతని ప్రాణాలను కాపాడి అతడిపై విశ్వాసం చూపించింది. గుండె పోటు వల్ల గిలగిలలాడుతున్న యజమాని సృహ కోల్పోకుండా చేయడంతో పాటు అతను ఆంబులెన్స్ కు ఫోన్ చేసేలా చేసి ప్రాణాలను రక్షించింది. యజమానిని కాపాడిన కుక్క గురించి నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు ఆ కుక్క తెలివిని ప్రశంసిస్తున్నారు.

    Also Read: బెగ్గర్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. రోజుకు రూ.215..!

    పూర్తి వివరాల్లోకి వెళితే బ్రియాన్‌ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి వాషింగ్టన్ లో జీవనం సాగించేవాడు. రమపో బెర్గెన్‌ యానిమల్‌ రెప్యూజీ అనే జంతు సంరక్షణ కేంద్రం నుంచి బ్రియాన్ కొన్ని నెలల క్రితం ఒక జర్మన్‌ షెపర్డ్‌ జాతికి చెందిన కుక్కను దత్తత తీసుకున్నాడు. ఆ కుక్కకు శాడీ అని పేరు కూడా పెట్టాడు. శాడీని బ్రియాన్ కన్నబిడ్డలా ఏ లోటు లేకుండా ఎంతో ప్రేమతో చూసుకునేవాడు.

    Also Read: మోదీ సూపర్ స్కీమ్.. రోజుకు రూ.10తో రూ.1.6 లక్షలు మీ సొంతం..?

    అయితే కొన్ని రోజుల క్రితం బ్రియాన్ కుటుంబ సభ్యులు వేరే ప్రాంతానికి వెళ్లిన సమయంలో బ్రియాన్ కు గుండెపోటు వచ్చింది. యజమాని గుండెనొప్పితో నేలపై పడి ఉండటం గమనించిన శాడీ అతని కళ్లను నాకుతూ స్పృహ కోల్పోకుండా చేసింది. ఆ తరువాత చొక్కాలో ఉన్న సెల్ ఫోన్ ను నోటితో పట్టుకుని యజమాని చేతికి ఫోన్ ను అందించింది. అతికష్టం మీద బ్రియాన్ ఆంబులెన్స్ కు ఫోన్ చేశాడు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    ఆ తరువాత క్షణాల్లో ఆంబులెన్స్ రావడం బ్రియాన్‌ కు వైద్య చికిత్స అందించడం జరిగింది. బ్రియాన్ చికిత్స తరువాత కోలుకుని కుక్క చేసిన పని చెప్పడంతో అతని కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. కుక్క సమయస్పూర్తి, తెలివితేటల గురించి తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.