spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP BJP-GVL : కాపు రిజర్వేషన్, రంగా ఇష్యూను లేవనెత్తిన ‘జీవీఎల్‌’పై పురంధేశ్వరి, చంద్రబాబువర్గం...

AP BJP-GVL : కాపు రిజర్వేషన్, రంగా ఇష్యూను లేవనెత్తిన ‘జీవీఎల్‌’పై పురంధేశ్వరి, చంద్రబాబువర్గం వ్యూహాత్మక దాడి

AP BJP-GVL ఏపీ బీజేపీని చంద్రబాబు రెండుగా చీల్చేస్తున్నాడు. తన అనుకూల వర్గాన్ని బీజేపీలో ఇన్నాళ్లు పెంచి పోషించి ఎన్నికల వేళ ప్లేటు ఫిరాయించేలా చేస్తున్నాడు. బీజేపీ తన మాట వినకపోవడంతో ఆ పార్టీని దెబ్బతీసే ఎత్తుగడ వేస్తున్నట్టు పరిణామాను బట్టి అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌ బీజేపీలో ఇప్పుడు మరో వివాదం తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. కన్నాలక్ష్మీ నారాయణ ఇష్యూ సద్దుమణగకముందే.. ఎంపీ జీవీఎల్‌ పై చంద్రబాబు వర్గం పడిపోయింది. బీజేపీ పార్టీలో కీలక నేత పురందేశ్వరి తాజాగా సొంత పార్టీ ఎంపీ జీవీఎల్ పై కామెంట్స్ చేయడం దుమారం రేపింది. చంద్రబాబు ఆటలో పురంధేశ్వరి కూడా అరటిపండుగా మారి బీజేపీని దెబ్బతీస్తున్నారా? అన్న చర్చ సాగుతోంది.

బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి బై బై చెబుతూ.. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఎంపీ జీవీఎల్‌ తీరు కారణంగానే పార్టీ వీడుతున్నానంటూ బాంబ్‌ పేల్చారు. అంతేకాదు కన్నాతో పాటు మరో 15 మందికిపైగా ద్వితీయ శ్రేణి నాయకులు సైతం పార్టీకి రాజీనామా చేశారు. ఈ వివాదం సమసిపోకముందే.. ఎంపీ జీవీఎల్‌కు ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు ఆ పార్టీ నేత పురందేశ్వరి. జీవీఎల్‌ మాటలను షేర్‌ చేస్తూ.. దానికి కౌంటర్‌ గా ట్వీట్‌ చేశారు. దీంతో ఏపీ బీజేపీలో ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది.. పార్టీలో కొందరి నేతలకు పకడ్బందీగానే అసలైన బీజేపీ వాదులైన జీవీఎల్‌,సోము వీర్రాజును టార్గెట్ చేస్తున్నారని.. వీరంతా చంద్రబాబు బ్యాచ్ అంటూ ప్రచారం సాగుతోంది. అయితే కాపు రిజర్వేషన్లు, వంగవీటి రంగా ఇష్యూను పార్లమెంట్ సాక్షిగా లేవనెత్తిన జీవీఎల్ కాపులకు మద్దతుగా రాజకీయం చేయడంతోనే కమ్మ బ్యాచ్ రంగంలోకి దిగి ఇలా జీవీఎల్ ను దెబ్బతీసే ఎత్తుగడ వేస్తున్నట్టు అర్థమవుతోంది.

– జీవీఎల్‌ ఏమన్నారంటే..
ఏపీలో కాపు రిజర్వేషన్ల కోసం భారీ ఉద్యమం కొనసాగిన సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని ఆయన పెద్దల సభలో జీవీఎల్ ప్రస్తావించారు. ఏపీలో కాపుల బాధలను ఎలుగెత్తి చాటారు. ఆంధ్రప్రదేశ్‌లో కాపులు ఆర్థికంగా, సామాజికంగా, విద్య పరంగా వెనుకబడి ఉన్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. తమకు రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేయాలని మూడు దశాబ్దాలుగా కాపులు ఉద్యమాలు చేశారని తెలిపారు. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీలో 2017లో విద్యా సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ బిల్లును పాస్‌ చేసినా, రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లు పాస్‌ చేసిందని పేర్కొన్నారు. రిజర్వేషన్ల కోసం వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే ఉందని.. అయినప్పటికీ బిల్లు ఆమోదం కోసం దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపారని మండిపడ్డారు. ముస్లిం రిజర్వేషన్‌ బిల్లును సమ్మతి కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపలేదని.. కాపుల బిల్లును మాత్రమే పంపారని విమర్శించారు. రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యతను కేంద్రంపై మోపాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని విమర్శించారు. కాపులకు వెంటనే రిజర్వేషన్‌ అమలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నానని తెలిపారు. ఇక, కాపుల రిజర్వేషన్ తోపాటు కాపుల నేత వంగవీటి రంగా ఘనతను పార్లమెంట్ లో ప్రస్తావించి వారికి వెన్నుదన్నుగా జీవీఎల్ నిలిచారు. వంగవీటి మోహనరంగా పేరుకు సంబంధించి తనపై కన్నా విమర్శలకు స్పందించనని జీవీఎల్ కామ్ గా ఉన్నారు. అయితే రాష్ట్రంలో చాలా కాలంగా అన్నింటికీ ఆ ఇద్దరు పేర్లే కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు.. ఎన్టీఆర్‌ , వైఎస్సార్‌లను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతటితో ఆగకుండా కృష్ణాజిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

-పురంధేశ్వరి కౌంటర్‌..
‘అన్నిటికీ ఆ ఇద్దరి పేర్లేనా’ అన్న జీవీఎల్‌ వ్యాఖ్యలను కోడ్‌ చేస్తూ.. ‘ఒకరు తెలుగు జాతికి గుర్తింపుని తీసుకొని వచ్చి, పేదలకు నిజమైన సంక్షేమం 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివీ ప్రజలకు అందిస్తే, మరొకరు ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 ఉచిత అంబులెన్సు సేవలు, ఆరోగ్యశ్రీ అందించారు’ అంటూ పురందేశ్వరి కౌంటర్‌ ఇచ్చారు. దీంతో తన తండ్రి ఎన్టీఆర్.. ప్రత్యర్థి పార్టీ వైసీపీ అధినేత తండ్రి వైఎస్ఆర్ కు మద్దతుగా పురందేశ్వరి ఈ ట్వీట్ చేశారు. సొంత పార్టీ ఎంపీ జీవీఎల్ కు కౌంటర్ ఇచ్చారు. కాపు నేత వంగవీటికి మద్దతుగా జీవీఎల్ నిలవడాన్ని పురందేశ్వరి తప్పుపట్టారు.దీంతో కాపులను ఎదగనీయకుండా.. వారిని తొక్కేసేలా కమ్మ బ్యాచ్ అంతా ఏకమవుతున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు లాబీ ఈ మేరకు రంగంలోకి దిగి ఇదంతా చేయిస్తోందన్న ప్రచారం సాగుతోంది.

-కాపుల గురించి మాట్లాడితే కమ్మలు రంగంలోకి..
ఎంపీ జీవీఎల్‌.నర్సింహారావు కాపుల గురించి మాట్లాడడం మొదలు పెట్టడంతో కమ్మ బ్యాచ్ రంగంలోకి దిగారు. ఎన్టీఆర్, వైఎస్సార్‌తో సమానంగా వంగవీటి రంగాను ఎంపీ జీవీఎల్‌ పోల్చారు. దీనిని సహించని కమ్మలు వెంటనే ఎదురుదాడి ప్రారంభించారు. కమ్మలకు మద్దతుగా మాట్లాడుతున్న జీవీఎల్‌ను బీజేపీ సీనియర్‌ నేత పురందేశ్వరితోపాటు చంద్రబాబునాయుడు వర్గం కూడా టార్గెట్‌ చేశారు. ఏపీలో చాలాకాలంగా కమ్మలు, రెడ్ల ఆధిపత్యం కొనసాగుతోంది. అందుకే కాపులు దశాబ్దాలుగా వెనుకబడే ఉంటున్నారు. రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్నారు. అయితే అన్ని పార్టీలు కాపులను ఓటుబ్యాంకుగా వాడుకుంటున్నాయి. కాపులు ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడం సంప్రదాయంగా వస్తోంది. 2014లో కమ్మ సామాజికివర్గానికి చెందిన చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీకి కాపులు మద్దతు ఇచ్చారు. దీంతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇక 2019లో కాపులు పూర్తిగా వైసీపీకి అండగా నిలిచారు. దీంతో జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఎవరు అధికారంలోకి వచ్చినా కాపులకు మాత్రం న్యాయం జరుగడం లేదన్నది బీజేపీ ఎంపీ జీవీఎల్‌.నర్సింహారావు ఆవేదన. ఈ విషయంపై ఆయన బహిరంగంగా మాట్లాడడంతో కమ్మ పార్టీగా ముద్రపడిన టీడీపీ నేతలు, బీజేపీలోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన పురందేశ్వరి వంటివారు జీవీఎల్‌ను టార్గెట్‌ చేయడం ఇప్పుడు ఆంధ్రాలో చర్చనీయాంశమైంది. ఇదంతా చంద్రబాబే బీజేపీని దెబ్బతీయడానికి చేయిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular