
Heroine Laya: టాలీవుడ్ లో హీరోయిన్ గా ఒక స్థాయికి ఎదిగిన తెలుగు అమ్మాయిల్లో లయ ఒకరు. ఈ విజయవాడ చిన్నది టాలెంటెడ్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ చిత్రాలు చేశారు. లయ విజయవాడలో పుట్టి పెరిగారు. నటి కావాలనే ఆశ చిన్నప్పటి నుండి ఉంది. అందుకే కూచిపూడి డాన్స్ లో శిక్షణ తీసుకున్నారు. 1992లో లయ చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయమయ్యారు. భద్రం కొడుకో అనే మూవీలో నటించారు. ఏడేళ్ల తర్వాత 1999లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. వేణు తొట్టెంపూడి హీరోగా కే విజయభాస్కర్ తెరకెక్కించిన స్వయంవరం మూవీలో ఆమెకు ఛాన్స్ వచ్చింది.
వేణుకి కూడా అదే మొదటి చిత్రం. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా వచ్చిన స్వయంవరం సూపర్ హిట్. వందేమాతరం శ్రీనివాస్ సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ అని అలరించాయి. ఉదిత్ నారాయణ పాడిన ”కీరవాణి రాగంలో” సాంగ్ అప్పట్లో బాగా ఫేమస్. డెబ్యూ మూవీతో సక్సెస్ అందుకున్న లయకు వరుస ఆఫర్స్ వచ్చాయి. మనసున్న మారాజు, హనుమాన్ జంక్షన్ చిత్రాలతో ఆమెకు బ్రేక్ వచ్చింది.
సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో ప్రేమించు మూవీ చేశారు. సాయి కిరణ్ హీరోగా నటించాడు. ప్రధాన పాత్ర మాత్రం లయదే. అంధురాలిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. స్టార్ క్యాస్ట్ లేకపోయినా ప్రేమించు సూపర్ హిట్ కొట్టింది. మిస్సమ్మ వంటి ప్రయోగాత్మక చిత్రాలతో పాటు ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి కామెడీ చిత్రాల్లో కూడా నటించారు. బాలయ్యకు జంటగా విజయేంద్ర ప్రసాద్ చిత్రం చేశారు. పరాజయాల శాతం ఎక్కువ కావడంతో లయ నిలదొక్కుకోలేకపోయారు. ఎక్కువగా ఆమెకు టైర్ టు హీరోల పక్కన ఛాన్సులు వచ్చాయి.

మలయాళ, కన్నడ చిత్రాల్లో కూడా నటించారు. 2006 తర్వాత నాలుగేళ్లు బ్రేక్ తీసుకున్నారు. 2010లో బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం మూవీ చేశారు. హీరోయిన్ గా లయకు ఇదే చివరి చిత్రం. ఆ సినిమా ఆడలేదు. కెరీర్ డౌన్ కావడంతో లయ పెళ్లి చేసుకున్నారు. అమెరికా డాక్టర్ అయిన గణేష్ గోర్తీ ని 2012లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈమె లాస్ ఏంజెల్స్ లో సెటిల్ అయ్యారు. వివాహం తర్వాత రవితేజ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.
దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో హీరోయిన్ తల్లి పాత్ర చేశారు. ఆ చిత్రం ఆడలేదు. మరలా లయ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించలేదు. ఆమెకు కొడుకు, కూతురు సంతానం. అమెరికా పౌరసత్వం కలిగిన లయ ఆ మధ్య లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఓటు వేయడానికి వచ్చారు.