https://oktelugu.com/

ఇంటికి కిటికీలు, గుమ్మాలు బేసి సంఖ్యలో ఉండకూడదా..?

మనలో కొంతమందికి ఏ పని మొదలుపెట్టినా ఆ పనుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. మరి కొంతమంది పనులు ప్రారంభించక ముందే ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇల్లు బాగానే ఉన్నా వాస్తు దోషాల వల్ల చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. చాలామంది ఇల్లు బాగానే కట్టించుకున్నా వాస్తు దోషాల వల్ల విపరీతంగా అప్పులు పెరిగిపోవడం, ప్రశాంతత లేకపోవడం, అనారోగ్య సమస్యలు, వ్యాపారాల్లో నష్టం రావడం జరుగుతుంది. Also Read: గడపకు పసుపు రాయడం వెనుక గల కారణం ఏమిటో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 2, 2021 / 09:52 AM IST
    Follow us on


    మనలో కొంతమందికి ఏ పని మొదలుపెట్టినా ఆ పనుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. మరి కొంతమంది పనులు ప్రారంభించక ముందే ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇల్లు బాగానే ఉన్నా వాస్తు దోషాల వల్ల చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. చాలామంది ఇల్లు బాగానే కట్టించుకున్నా వాస్తు దోషాల వల్ల విపరీతంగా అప్పులు పెరిగిపోవడం, ప్రశాంతత లేకపోవడం, అనారోగ్య సమస్యలు, వ్యాపారాల్లో నష్టం రావడం జరుగుతుంది.

    Also Read: గడపకు పసుపు రాయడం వెనుక గల కారణం ఏమిటో తెలుసా?

    అయితే ఇంటికి ఉండే గుమ్మాలు, కిటికీలు సరి సంఖ్యలోనే ఉండాలని అవి సరి సంఖ్యలో లేకపోతే ఇబ్బందులు తప్పవని కొందరు వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంటికి గుమ్మాలు, కిటికీలు 2, 4, 6, 8… ఇలా ఉంటే మంచిదని అదే సమయంలో సరిసంఖ్య అయినా చివర సున్నా ఉండకూడదని వాస్తు నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ విధంగానే ఉండాలని వాస్తు శాస్త్రంలో చెప్పినట్టు ప్రజల్లో జోరుగా జరుగుతోంది.

    వాస్తుశాస్త్రం ప్రకారం గుమ్మాలు, కిటికీలు సరి సంఖ్యలో ఉంటే గాలి, సూర్యరశ్మి ఇంట్లోకి సమతుల్యతతో చేరే అవకాశం ఉంది. అందువల్ల కొత్తగా ఇల్లు కట్టాలనుకునే వారు, ఇప్పటికే ఇల్లు కట్టుకున్నవారు గుమ్మాలు, కిటికీలు సరి సంఖ్యలో ఉన్నాయో బేసి సంఖ్యలో ఉన్నాయో చెక్ చేసుకుంటే మంచిది. అదే సమయంలో గృహ నిర్మాణానికి పనికిరాని స్థలాలలో ఇల్లు కట్టకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

    Also Read: తులసి మొక్కకు శాపం పెట్టిన వినాయకుడు.. కారణం ఇదే!

    మరి కొంతమందిని సింహ ద్వారం ఎక్కడ పెట్టాలనే సందేహం వేధిస్తూ ఉంటుంది. ఇంటిని 9 సమ భాగాలుగా విభజించి 4, 5, 6 భాగాలలో సింహ ద్వారం పెడితే మంచిది. సింహ ద్వారం వీధికి ఎదురుగా ఉండకూడదు. అదే సమయంలో సింహ ద్వారానికి లోపలి వైపు మరో గుమ్మం ఉండాలి.

    మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం