Homeఆంధ్రప్రదేశ్‌Ram Mohan Naidu: రామ్మోహన్ నాయుడుపై అదే ఏడుపు!

Ram Mohan Naidu: రామ్మోహన్ నాయుడుపై అదే ఏడుపు!

Ram Mohan Naidu: ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వికృత రాజకీయ క్రీడ ఆడుతోంది. అంది వచ్చిన ఏ అవకాశాలను అది జారవిడుచుకోవడం లేదు. అంతులేని ప్రజామోదంతో అధికారంలోకి వచ్చింది కూటమి. ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి. ప్రతిపక్ష హోదా కోసం అధికారపక్షంతో కొట్లాట మాదిరిగా పోరాడుతోంది. ఇంకా మూడేళ్ల అధికారం ఉన్న కూటమికి.. తాము అధికారంలోకి వస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరిస్తోంది. ఒక అధికార పార్టీని ప్రతిపక్షం ఈ స్థాయిలో హెచ్చరించడం ఎక్కడ చూడలేదు. ఆల్రెడీ అధికారంలో ఉన్నారు వాళ్లు. తమలాంటి ఆలోచన వారికి వస్తే పరిస్థితి ఏంటనేది గ్రహించడం లేదు. ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేయడమే పనిగా పెట్టుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్ విమాన ప్రమాదాన్ని తెలుగుదేశం పార్టీతో లింక్ పెట్టడం చూస్తుంటే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దుర్బుద్ధి తెలుస్తోంది.

* కొద్ది రోజుల కిందట ఘటన..
కొద్ది రోజుల కిందట విమాన ప్రమాదంలో అజిత్ పవర్ మృతి చెందారు. ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన విమానంలో ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. విమానం కూలిపోవడంతో అజిత్ పవర్ చనిపోయారు. అయితే ఈ విమాన ప్రమాదంపై పౌర విమానయాన శాఖ దర్యాప్తు చేస్తోంది. అయితే అజిత్ పవర్ విమాన ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉంది అంటూ ఆయన సమీప బంధువు.. మేనల్లుడు రోహిత్ పవర్ ఆరోపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ విచారణ పూర్తయ్యే వరకు కింజరాపు రామ్మోహన్ నాయుడును పౌర విమానయాన శాఖ మంత్రి పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేయడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆ డిమాండ్ వచ్చినప్పటి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అదే పనిగా ప్రచారం మొదలుపెట్టింది.

* సమీప బంధువు డిమాండ్ తో
మహారాష్ట్రలో ఎన్సీపీ చీలిపోయిన సంగతి తెలిసిందే. శరద్ పవర్ ను ఒక విభేదించి అజిత్ పవర్ బిజెపితో చేతులు కలిపారు. అయితే చనిపోయే ముందు శరద్ పవర్ తో సంధి చేసుకున్నారు. ఇంతలోనే ఎన్నికల ప్రచారానికి వెళ్తూ చనిపోయారు. అయితే అజిత్ పవర్ విమాన ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. అయితే అటువంటిదేమీ లేదని శరద్ పవర్ తేల్చేశారు. కానీ ఇటీవల అజిత్ పవర్ మేనల్లుడు రోహిత్ పవర్ మాత్రం కుట్ర కోణం ఉందని ఆరోపణలు చేశారు. ఈ విచారణ సజావుగా సాగాలి అంటే మంత్రి పదవి నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడును తొలగించాలని కోరారు. సంబంధిత ప్రైవేటు విమాన సంస్థ యజమానితో టిడిపి నేతలకు సంబంధాలు ఉన్నాయని.. అందుకే విచారణ పై ప్రభావం చూపుతారని చెప్పుకొచ్చారు. కానీ రోహిత్ పవర్ కు తెలియంది ఏమిటంటే సంబంధిత విమాన సంస్థల యజమానితో అజిత్ పవర్ కు మూడున్నర దశాబ్దాల సంబంధాలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలు చేస్తున్న రోహిత్ పవర్ శరద్ పవర్ వర్గంలో ఉన్నారు. ఎన్సిపి శరద్ పవర్ ఇండియా కూటమి కాబట్టి.. ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారు. అయితే కింజరాపు రామ్మోహన్ నాయుడు ను మంత్రి పదవి నుంచి దూరం చేయాలని ఆయన కోరడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆకర్షించింది. వెంటనే దీనిపై ప్రచారం మొదలు పెట్టేసింది. గుజరాత్ విమాన ప్రమాద సమయంలో, ఇండిగో సంక్షోభ సమయంలో కూడా ఇలానే రామ్మోహన్ నాయుడు పై ప్రచారం చేసింది వైసిపి. ఇప్పుడు తాజాగా అజిత్ పవర్ విమాన ప్రమాదం విషయంలో జరుగుతున్న పరిణామాలతో ఏడుపు మొదలు పెట్టింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version