Abhishek Sharma : 0, 68*, 0, 30, 0,.. ఇవీ గడిచిన ఐదు ఇన్నింగ్స్ లలో అభిషేక్ శర్మ చేసిన పరుగులు. అభిషేక్ శర్మ ఉన్న దూకుడు ప్రకారం చూసుకుంటే ఈ పరుగులు పెద్ద లెక్కలోవి కావు. ఎందుకంటే అభిషేక్ శర్మ విధ్వంసానికి మారుపేరుగా ఆడుతూ ఉంటాడు. అందువల్లే పాకిస్తాన్ జట్టుతో జరిగే మ్యాచ్లో అతని మీద భారీగా అంచనాలు ఉన్నాయి.
పాకిస్తాన్ జట్టుతో జరిగే మ్యాచ్ కంటే ముందు అభిషేక్ శర్మ అమెరికాతో జరిగిన మ్యాచ్లో డక్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ కు దూరమయ్యాడు. అతడు కడుపు నొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో ఆసుపత్రికి పరిమితమయ్యాడు.
పాకిస్తాన్ జట్టుతో జరిగే మ్యాచ్ కు అతడు ఫిట్ గా ఉండడంతో ఎంపిక చేశారు. దీంతో అతడు బీభత్సంగా బ్యాటింగ్ చేస్తాడని అందరూ అనుకున్నారు. మెరుపు వేగంతో పరుగులు సాధిస్తాడని భావించారు. కానీ, ఊహించని విధంగా మూడు బంతులకు ఒక్క పరుగు కూడా తీయలేకపోయాడు. నాలుగో బంతిని భారీ షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు.
న్యూజిలాండ్ సిరీస్ లో పడుతూ లేస్తూ సాగిన అభిషేక్ శర్మ బ్యాటింగ్.. టి20 వరల్డ్ కప్ లో కూడా అలాగే సాగుతోంది. ఆడిన రెండు మ్యాచ్లలో అతడు 0 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ టోర్నీలో హైయెస్ట్ స్కోర్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్లలో అభిషేక్ శర్మ ఒకడు. కానీ అతడు వరుసగా రెండు మ్యాచ్లలో సున్నా పరుగులకు అవుట్ కావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
“గొప్పగా ఆడతావని అనుకున్నాం. భారీగా పరుగులు తీస్తావని భావించాం. కానీ, నువ్వేమో పాకిస్తాన్ జట్టు మీద సున్నా చుట్టి వచ్చావు. ఇది ఎంతవరకు కరెక్ట్. ఎన్నో అంచనాలు పెట్టుకున్నాం కదా.. చివరికి ఇలా చేశావని” భారతీయ అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.
అభిషేక్ శర్మ పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సాధించలేదని.. అందువల్లే అతడు తన స్థాయిలో ఆడ లేకపోయాడు. ఫలితంగా టీమిండియా భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేయకుండానే.. కేవలం ఒక్క పరుగు వద్ద వికెట్ కోల్పోయింది. ఫలితంగా టీమిండియా అభిమానుల ఆశలు మొత్తం అడియాసలుగా మారిపోయాయి. ఒకవేళ అభిషేక్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేసి ఉంటే.. వేగంగా పరుగులు తీసి ఉంటే.. టీమిండియా పరిస్థితి మరో విధంగా ఉండేది. భారీ భాగస్వామ్యం నమోదు అయ్యేది.