Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu RGV Controversy: మహేష్ బాబు కి ఆర్జీవీ అంటే నచ్చదా..? అందుకే ఆ...

Mahesh Babu RGV Controversy: మహేష్ బాబు కి ఆర్జీవీ అంటే నచ్చదా..? అందుకే ఆ సూపర్ హిట్ సినిమాను మిస్ చేసుకున్నాడా..?

Mahesh Babu RGV Controversy: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల క్రేజ్ ఎక్కువగా ఉంది. వాళ్ళ వారసత్వంగా ఇండస్ట్రీ కి రావడం ఒకెత్తయితే అమితమైన ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకోవడం మరొకెత్తుగా మారింది. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో వారణాసి అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు. కానీ డైరెక్ట్ గా పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రాజమౌళి ఉన్నాడనే ధైర్యంతోనే మహేష్ బాబు ఇలాంటి ఒక సాహసమైతే చేస్తున్నాడు… ఇక మహేష్ బాబు తో సినిమా చేయాలని చాలా మంది దర్శకులు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అందులో రామ్ గోపాల్ వర్మ ఒకరు… కానీ మహేష్ బాబుకి రామ్ గోపాల్ వర్మ సినిమాలంటే పెద్దగా నచ్చకపోవడంతో మహేష్ అతనితో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తిని చూపించలేదు…

దానివల్లే వర్మ డైరెక్షన్లో మహేష్ బాబు రెండు సినిమాలను చేసే అవకాశాన్నైతే కోల్పోయాడు…సుమంత్ హీరోగా చేసిన ‘ప్రేమ కథ’ మూవీని మొదట మహేష్ బాబు తోనే చేయాలని అనుకున్నారట. కానీ మహేష్ బాబు, కృష్ణ ఇద్దరు ఆ సినిమాకి పెద్దగా కనెక్ట్ అవ్వకపోవడంతో వర్మ ను పక్కన పెట్టేసారు.

ఇక ఆ తర్వాత నితిన్ హీరోగా రామ్ గోపాల్ వర్మ ‘అడవి’ అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమా కథని ముందుగా చాలా హై రేంజ్ లో రాసుకొని మహేష్ కి వినిపించారట. కానీ మహేష్ బాబు అప్పుడు కూడా ఆ కథని రిజెక్ట్ చేయడంతో ఆ కథని కొంచెం మార్పులు చేర్పులు చేసి నితిన్ తో చేశారు.

ఆ సినిమా డిజాస్టర్ గా మారింది. మొత్తానికైతే ఆర్జీవీ విషయంలో మహేష్ బాబు తీసుకున్న నిర్ణయాలు రెండుసార్లు రైట్ అయ్యయి. ప్రేమ కథ, అడవి రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వడంతో ఆర్జీవీ విషయంలో మహేష్ బాబు చాలా క్లారిటీ గా ఉన్నాడని ప్రతి ఒక్కరు మహేష్ బాబుని అప్రిషియేట్ చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version