https://oktelugu.com/

మహేష్, ప్రభాస్ వద్దు అన్న కథతోనే.. బాలీవుడ్ స్టార్ !

‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్ లో ఓ ట్రెండ్ ను సెట్ చేసి.. అదే బోల్డ్ సినిమాని హిందీలో కబీర్ సింగ్ గా తీసి స్టార్ డమ్ ను తెచ్చుకుని భారీ సక్సెస్ కొట్టాడు సందీప్ వంగ. అయితే, ప్రస్తుతం తన కొత్త సినిమాని బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్లో రాబోతున్న కొత్త సినిమా గురించి నిన్న అప్ డేట్ ఇచ్చారు. కాగా సీనియర్ నటుడు అనీల్ కపూర్ – […]

Written By:
  • admin
  • , Updated On : January 2, 2021 / 10:00 AM IST
    Follow us on


    ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్ లో ఓ ట్రెండ్ ను సెట్ చేసి.. అదే బోల్డ్ సినిమాని హిందీలో కబీర్ సింగ్ గా తీసి స్టార్ డమ్ ను తెచ్చుకుని భారీ సక్సెస్ కొట్టాడు సందీప్ వంగ. అయితే, ప్రస్తుతం తన కొత్త సినిమాని బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్లో రాబోతున్న కొత్త సినిమా గురించి నిన్న అప్ డేట్ ఇచ్చారు. కాగా సీనియర్ నటుడు అనీల్ కపూర్ – రణబీర్ కపూర్- బాబీ డియోల్ కాంబినేషన్ మల్టీస్టారర్ మూవీగా రానున్న ఈ సినిమాకి ‘యానిమల్’ అనే టైటిల్ పెట్టారు.

    Also Read: వైరల్ పిక్స్: న్యూ ఇయర్ రోజున ఆ ఇద్దరితో మోనాల్ ఎంజాయ్

    ఇక ఈ సినిమాలో పరిణీతి చోప్రా కథానాయికగా నటించబోతుంది. ఇప్పటికే ప్రీ-లుక్ టీజర్ లో రణబీర్ కపూర్ వాయిస్ తో బ్యాక్ డ్రాప్ లో కథను కూడా వినిపించారు. ఇదొక పునర్జన్మల కాన్సెప్ట్. ‘హీరో తన తండ్రిని తరువాతి జీవితంలో తన కొడుకుగా జన్మించమని .. ఆ తర్వాత మళ్ళీ తండ్రిగా జన్మించమని కూడా అడుగుతాడు; అంటే.. తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ డ్రామా అన్నమాట ఈ సినిమా. అయితే మొదట ఈ సినిమా కథను తీసుకుని సందీప్ రెడ్డి మన తెలుగు సూపర్‌స్టార్లు చుట్టూ తిరిగాడని తెలుస్తోంది.

    Also Read: అందరికీ షాకిచ్చిన స్టార్ హీరోయిన్

    మహేష్, ప్రభాస్, బన్నీ లాంటి హీరోలు ఈ కథ ‌పై ఆసక్తి చూపించలేదు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా చేద్దామని సందీప్ ఎంతగా ట్రై చేసినా మన తెలుగు హీరోలు ముందుకు రాలేదు. కానీ రణభీర్ కపూర్ ఈ సినిమా పై ఇంట్రస్ట్ చూపించడంతో ఈ సినిమా పట్టాలెక్కింది. ఒకవిధంగా రణభీర్ కపూర్ మన హీరోలు కంటే భారీ మార్కెట్ ఉన్న హీరో. పైగా పెద్ద హీరో కూడా. ఆ రకంగా సందీప్ కి ఇది బెటర్ ఛాన్సే.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్