Shaakuntalam Trailer: రాజమౌళి కంటే ముందు భారీ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు గుణశేఖర్. కోట్లు ఖర్చు చేసి అద్భుతమైన సెట్స్ వేయించేవాడు ఆయన. ఒక్కడు మూవీలోని చార్మినార్ సెట్, అర్జున్ చిత్రంలో చూపించిన మధుర మీనాక్షి టెంపుల్ సెట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అప్పట్లో ఈ భారీ సెట్స్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి. జనాలు ప్రముఖంగా చెప్పుకున్నారు. గుణశేఖర్ తెరకెక్కించిన మరో భారీ చిత్రం రుద్రమదేవి. అనుష్క శెట్టి టైటిల్ రోల్ చేయగా… కాకతీయుల చరిత్ర మెచ్చుకునే విధంగా గుణశేఖర్ తెరకెక్కించారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని రూ. 70-80 కోట్ల బడ్జెట్ తో చేయడం పెద్ద సాహసమే.

రుద్రమదేవి సమయంలో ఓటీటీ బిజినెస్ కూడా లేదు. థియేట్రికల్, శాటిలైట్ రైట్స్ తోనే నిర్మాత బయటపడాలి. సినిమా ఆడకపోతే దారుణ నష్టాలు చూడాల్సి వస్తుంది. రుద్రమదేవి విడుదలైన 8 ఏళ్లకు శాకుంతలం మూవీతో ఆయన ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అయ్యారు. ఇది కూడా లేడీ ఓరియెంటెడ్ భారీ బడ్జెట్ మూవీ కావడం విశేషం.
శాకుంతలం మూవీ కథ పురాణాలు తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలిసినదే. ఈ జనరేషన్ కి పురాణాలు తెలియవు కాబట్టి యూత్ కి తెలియని కథని చెప్పొచ్చు. విశ్వామిత్ర మహర్షికి-దేవనర్తకి మేనకకు పుట్టిన అమ్మాయి శకుంతల. ప్రకృతివనంలో పెరిగిన శకుంతలను రాజైన దుష్యంతుడు ప్రేమిస్తాడు. ఆ ప్రేమ ఫలితంగా శకుంతల గర్భవతి అవుతుంది. దుర్వాస మహర్షి శాపానికి బలైన శకుంతల కష్టాల పాలవుతుంది… మొత్తంగా ఇదే కథ.

శాకుంతలం ట్రైలర్ ఆకట్టుకుంది. విజువల్స్ ట్రైలర్ లో ప్రధాన ఆకర్షణ. శాకుంతలం షూటింగ్ మొత్తం సెట్స్ లో పూర్తి చేశారు. చాలా తక్కువ సమయంలో చిత్రీకరణ ముగిసింది. ప్రతి సన్నివేశం సీజీ వర్క్ తో కూడుకొని ఉంటుంది. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమైంది. శాకుంతలం విఎఫ్ఎక్స్ వర్క్ అద్భుతం అనలేము కానీ… పర్లేదు. పౌరాణిక పాత్ర కాబట్టి… సమంతకు సొంత వాయిస్ కాకుండా డబ్బింగ్ చెప్పిస్తే బాగుండేది. గ్రాంథికం తెలుగు ఆమె మాట్లాడుతుంటే అర్థం కాకపోగా… సూట్ కాలేదు. ఫిబ్రవరి 17న శాకుంతలం విడుదల అవుతుంది. మోహన్ బాబు దుర్వాస మహర్షిగా కీలక రోల్ చేశారు. శకుంతల ప్రియుడు దుష్యంతుని పాత్ర మోహన్ దేవ్ చేశారు. ట్రైలర్ చివర్లో అల్లు అర్హను కూడా పరిచయం చేశారు. ఈ సినిమా జనాలను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. సమంత ఫేమ్ మాత్రమే ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించాలి.