Surekha Vani: సురేఖా వాణి పరిచయం అక్కర్లేని పేరు. రెండు దశాబ్దాలుగా ఆమె పరిశ్రమలో ఉన్నారు. ఒడ్డు పొడుగుతో… నాజూగ్గా ఉండే సురేఖా వాణి మంచి హీరోయిన్ మెటీరియల్. ఆమె టైం బాగోక క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ అయ్యారు. శ్రీను వైట్ల సినిమాల్లో లేడీ కమెడియన్ గా ఆమె పాపులర్ అయ్యారు.దుబాయ్ శ్రీను, రెడీ, నమో వెంకటేశా చిత్రాల్లో సురేఖా తన కామెడీతో ఆకట్టుకున్నారు. ఆర్టిస్ట్ గా ఆమె కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్న తరుణంలో విషాదం చోటు చేసుకుంది. సురేఖా వాణి భర్త సురేష్ తేజా అనారోగ్యంతో కన్నుమూశాడు. 2019లో ఆయన మరణించగా సురేఖా వాణి సినిమాల నుండి గ్యాప్ తీసుకున్నారు.

ఇక 2020 మొత్తం కరోనా కారణంగా పరిశ్రమ నెమ్మదించింది. షూటింగ్స్ జరగలేదు. లాక్ డౌన్ అనంతరం సినిమాల చిత్రీకరణ యథావిధిగా జరుగుతుంది. అయితే సురేఖా వాణి కనిపించడం లేదు. ఒకప్పుడు ఏడాదికి పది చిత్రాలు చేసిన సురేఖా వాణి ఒకటి రెండు చిత్రాలు కూడా చేయడం లేదు. ఆ మధ్య ఓ మూవీలో ఆమెకు అవకాశం వచ్చింది. ఆ చిత్ర ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న సురేఖా వాణి పరిశ్రమ మీద కొంత అసహనం వ్యక్తం చేశారు. సురేఖా వాణి సినిమాలు మానేశారా? సిల్వర్ స్క్రీన్ పై ఎందుకు కనిపించడం లేదు? అని చాలామంది అడుగుతున్నారు.
దానికి కారణం ఒకటే… మమ్మల్ని పరిశ్రమ ప్రక్కన పెట్టేసింది. అవకాశాలు మాదాక రావడం లేదు. ఆఫర్స్ వస్తే సినిమాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధమే. సురేఖా వాణి సినిమాలు మానేయలేదని సూటిగా చెప్పింది. అప్పట్లో ఆమె వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఆమెకు ఆఫర్స్ ఇచ్చే దర్శకుడు శ్రీను వైట్లకి సైతం ఫేడవుట్ పరిస్థితి ఏర్పడగా సురేఖా సిల్వర్ స్క్రీన్ కి దూరమయ్యారు.

అయితే సోషల్ మీడియాలో ఆమె సంచలనాలు కొనసాగుతున్నాయి. గత రెండేళ్లుగా సురేఖా వాణి గ్లామరస్ ఫోటోలు, హాట్ వీడియోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. సురేఖకు టీనేజ్ కూతురు ఉంది. ఆమె పేరు సుప్రీత. కూతురితో సురేఖ చాలా సన్నిహితంగా ఉంటారు. బెస్ట్ ఫ్రెండ్స్ కి మించి లైఫ్ కలిసి ఎంజాయ్ చేస్తారు. ఇద్దరూ స్కర్ట్స్, షార్ట్ ఫ్రాక్స్ వేసి డాన్స్ వీడియోలు చేసి ఇంస్టాగ్రామ్ లో విడుదల చేస్తారు. తాజాగా డెనిమ్ షార్ట్ ధరించి కూతురితో పాటు ఫోజులిచ్చింది. ఆ ఫోటో చూస్తే సురేఖా వాణి గ్లామర్ లో సుప్రీతకు పోటీ ఇస్తున్నట్లుగా ఉంది.