Revanth Reddy: తెలంగాణలో రాజకీయాలు ఇప్పటికే వేడెక్కాయి. బీఆర్‌ఎస్‌ను గద్దె దించేందుకు బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. ప్రత్యామ్నాయం తామంటే.. తాము అని ప్రకటిస్తున్నాయి. ఇక బీఆర్‌ఎస్ కూడా మూడోసారి అధికారంలోకి రావడంపైనే దృష్టిపెట్టింది. ఈ క్రమంలో మూడు ప్రధాన పార్టీలు అంతర్గత సర్వేలు చేసుకుంటున్నాయి. బీఆర్‌ఎస్‌కు మళ్లీ వంద సీట్లు ఖాయమని కేసీఆర్ అంటుండగా, బీజేపీకి 60 సీట్లు వస్తాయని బండి సంజయ్ చెబుతున్నారు. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాత్రం.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు 40 సీట్ల వరకు వస్తాయంటున్నారు. ఈ లెక్కలన్నీ ఆయా పార్టీల సొంత సర్వే ప్రకారం చెప్పినవే. అయితే రేవంత్ తమ సర్వేలో బీజేపీ అసలు రేసులోనే లేదని ప్రకటించారు.
మొన్న 70.. నిన్న 45..
రేవంత్ రెడ్డి తాము పార్టీ తరఫున చేసిన ఓ సర్వేను రిలీజ్ చేశారు. గతంలో కాంగ్రెస్‌కు డెభ్బై సీట్లు ఖాయమని చెబుతూ ఉండేవారు. కానీ ఈసారి సర్వేలో 45 సీట్లు మాత్రమే వేసుకున్నారు . బీఆర్‌ఎస్‌కు కూడా 45 సీట్లు వస్తాయని చెబుతున్నారు. బీజేపీకి ఏడు సీట్లు ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కచోట గెలిచి.. 111 చోట్ల డిపాజిట్ కోల్పోయిన బీజేపీకి ఏడు సీట్లు ఇవ్వడం అంటే గొప్ప విషయమే. కానీ.. తన పార్టీ గెలుస్తుందని ఎందుకు చెప్పలేదని .. కాంగ్రెస్ నేతలకూ డౌట్ వస్తోంది.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ అని..
అసలు బీజేపీలో రేసులో లేదని.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోరు జరుగుతోందని చెప్పడానికే రేవంత్‌రెడ్డి ఈ సర్వే రిలీజ్ చేశాడని అంటున్నారు. కాంగ్రెస్‌లో ఇటీవల చేరికలు పెరుగుతున్నాయి. కొంత మంది డైలమాలో ఉన్నారు. ముఖ్యంగా బీజేపీలో ఉన్న కొంత మంది నేతలు మళ్లీ కాంగ్రెస్‌లోకి రావాలని చూస్తున్నారు. కానీ రాజకీయం ఎప్పుడు ఎలా మారుతుందో వారికి అర్థం కావడం లేదు. అందుకే వేచి చూస్తున్నారు. బీజేపీకి ఇక స్కోప్ లేదని.. చెప్పడానికే రేవంత్ ఈ సర్వే రిలీజ్ చేశాడని అంటున్నారు. కేసీఆర్ తో హోరాహోరీ పోరు సాగుతోందని.. బీజేపీలో ఉన్న నేతలు బయటకు వచ్చి.. కాంగ్రెస్ తో జత కడితే.. కేసీఆర్ ను ఓడించవచ్చన్న సందేశాన్ని ఈ సర్వే ద్వారా రేవంత్ పంపారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏకపక్షంగా కాంగ్రెస్ గెలుస్తుందని ప్రకటించుకుంటే.. దానికి పెద్దగా విలువ ఉండదు. అందుకే ఓటు బ్యాంక్ కూడా బీజేపీకి 22 నుంచి 14కు పడిపోయిందని తెలిపారు.
చేరికలను ప్రోత్సహించేందుకే..
కాంగ్రెస్‌లో చేరికలను ప్రోతసహించేందుకే రేవంత్ సర్వే మంత్రం వేశారు. భారీ మిషన్ చేపట్టారు.. అయితే ఈ సర్వే ఇప్పుడ సొంత పార్టీ నేతలే సందేహం వ్యక్తం చేయడం గమనార్హం. మరోవైపు బీజేపీ నేతలు కూడా రేవంత్ వ్యూహాన్ని పసిగట్టారు. కాంగ్రెస్‌లో అభ్యర్థులు లేకపోవడంతో ఇతర పార్టీల నుంచి చేరేందుకు రేవంత్ ఇలా సర్వే అస్త్రం ప్రయోగించారని అంటున్నారు. విశ్లేషకులు కూడా దీనిని కొంతవరకు అంగీకరిస్తున్నారు.