https://oktelugu.com/

Rakesh Master- Prabhas: ప్రభాస్ తో రాకేశ్ మాస్టర్.. పిక్ వైరల్.. ఏ సినిమాదో తెలుసా?

రెబల్ స్టార్ ప్రభాస్ యాక్టింగ్ పరంగానే కాకుండా డ్యాన్స్ తో కూడా ఆకట్టుకుంటాడన్న విషయం తెలిసిందే. ఆయన సినిమాల్లో డ్యాన్స్ తో కూడి ఓ పాట కచ్చితంగా ఉంటుంది. అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ప్రభాస్ కు రాకేశ్ మాస్టర్ డ్యాన్స్ నేర్పించారు.

Written By:
  • Srinivas
  • , Updated On : June 19, 2023 / 03:42 PM IST

    Rakesh Master- Prabhas

    Follow us on

    Rakesh Master- Prabhas: తెలుగు చిత్ర సీమలో వరుస విషాదాలు కొనసాగుతున్నాయి. కొన్ని రోజుల కిందట ప్రముఖ నటుడు శరత్ బాబు మరణ వార్త మరిచిపోకముందే తాజాగా కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూశారు. వడదెబ్బకు గురైన ఆయన తీవ్ర అస్వస్థతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించారు. రాకేష్ మాస్టర్ తెలుగు సినిమాల్లో ఎందరో హీరోలకు డ్యాన్స్ నేరారు. మొత్తంగా ఆయన 1500కు పైగా సినిమాలకు పనిచేసినట్లు తెలుస్తోంది. రాకేష్ మాస్టర్ తో పనిచేసిన వాళ్లంతా కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయనకు సంతాపం తెలుపుతూ గత గుర్తులను స్మరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాకేష్ మాస్టర్ కు సంబంధించిన ఓ పిక్ వైరల్ గా మారింది.

    రెబల్ స్టార్ ప్రభాస్ యాక్టింగ్ పరంగానే కాకుండా డ్యాన్స్ తో కూడా ఆకట్టుకుంటాడన్న విషయం తెలిసిందే. ఆయన సినిమాల్లో డ్యాన్స్ తో కూడి ఓ పాట కచ్చితంగా ఉంటుంది. అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ప్రభాస్ కు రాకేశ్ మాస్టర్ డ్యాన్స్ నేర్పించారు. ప్రభాస్ ‘ఈశ్వర్’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత రాఘవేంద్ర అనే మూవీ తీశాడు. ఈ సినిమా కోసం ప్రభాస్ రాకేష్ మాస్టర్ వద్ద డ్యాన్స్ నేర్చుకుంటున్నాడని కొందరు సోషల్ మీడియాలో పెట్టారు. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ప్రభాస్ పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాలో పిక్ పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది.

    ఇక రాకేస్ మాస్టర్ సీతయ్య, లాహిరి లాహిరి లాహిరి, దేవదాసు లాంటి సినిమాలు నృత్యదర్శకుడిగా పనిచేశాడు. మెరికలు తిరిగే డ్యాన్స్ చేయడం రాకేష్ సొంతం. ఆయన బాటలోనే ఆయన శిష్యులు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ లు కూడా ప్రముఖులుగా వెలుగొందుతున్నారు. శేఖర్ మాస్టర్ ప్రస్తుతం స్టార్లుగా కొనసాగుతున్నారు. అయితే అంతటి రాకేశ్ మాస్టర్ ఈరోజు మనమధ్య లేకపోవడం ఎంతో బాధకరమని చాలా మంది అంటున్నారు.

    అయితే రాకేశ్ మాస్టర్ కు రెండు నెలల కిందటే హనుమాన్ చిత్రం కోసం పనిచేస్తున్నప్పుడు అనారోగ్యంతో బాధపడినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచే ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న రాకేశ్ కొందరు డాక్టర్లు జాగ్రత్తగా ఉండమని చెప్పారు. అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా రాకేశ్ మాస్టర్ చనిపోయాడన్న వార్త తెలియగానే అంతా షాక్ అయ్యారు. దీంతో రాకేశ్ ఎక్కడున్నా ఆత్మశాంతితో ఉండాలని కోరుకుంటున్నారు.