Poll Management in AP: ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. చివరి ఏడాదిని ఎన్నికల సంవత్సరంగా చూస్తే మిగిలింది ఏడాది మాత్రమే. మరోవైపు తెలంగాణ మాదిరిగానే ఏపీలోనూ ముందస్తు ఎన్నికలు ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ప్రతిపక్షాలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఉన్న క్రేజ్, గత ఎన్నికల్లో ఆపార్టీ సాధించిన ఎమ్మెల్యే సంఖ్యను బట్టి చూస్తే అదంతా ఆషామాషీ కాదనే కామెంట్స్ విన్పిస్తోంది. ఇటీవల జరిగిన మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ వేవ్ స్పష్టంగా కన్పించింది. గ్రామస్థాయిలో వైసీపీ బలంగా ఉండటం వచ్చే ఎన్నికల్లో ఆపార్టీ కలిసి వచ్చే అంశంగా మారనుంది.
Also Read: ఏపీలో వైసీపీపై సమరశంఖం పూరిస్తున్న బీజేపీ
ఈనేపథ్యంలోనే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ పోల్ మేనేజ్ మెంట్ పై దృష్టిసారించింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీచేసి అధికారంలోకి వచ్చాయి. అయితే 2019 నాటికి టీడీపీ, జనసేన, బీజేపీలు విడివిడిగా పోటీ చేశాయి. ఈ ప్రభావం ఆ ఎన్నికల్లో స్పష్టంగా కన్పించింది. ఇక ఏపీ ప్రజలు జగన్ ఒకసారి ఛాన్స్ ఇవ్వాలని భావించడం వైసీపీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో బాగా కలిసొచ్చింది.
వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల కావొస్తుంది. ఈ సమయంలో ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత రాగా మెజార్టీ వర్గాలు మాత్రం వైసీపీ అండగానే ఉన్నాయి. దీంతో జగన్ దెబ్బ కొట్టాలంటే మాత్రం ప్రతిపక్ష పార్టీలు కూటమిగా వెళితేనే సాధ్యం పడుతుందనే నేతలు అంచనా వేస్తున్నా. లేదంటే మాత్రం మరోసారి జగన్ కే ఛాన్స్ దక్కే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈక్రమంలోనే టీడీపీతో జనసేన పొత్తు ఖాయమనే వాదనలు విన్పిస్తుంది. వీరిద్దరి డెడ్లీ కాంబినేషన్ అవుతుందనే అంచనా ఉన్నాయి. మరోవైపు కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీపై ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తోంది. ఈక్రమంలోనే బీజేపీని పక్కన పెట్టి లెప్ట్ పార్టీలను కలుపుకొని కొత్త కూటమి ఏర్పాటు కానుందనే టాక్ విన్పిస్తోంది.
రాబోయే ఎన్నికల నాటికి టీడీపీ-జనసేన-లెప్ట్ పార్టీలతో కూటమి ఏర్పాటు చేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రణాళికలను రచించినట్లు తెలుస్తోంది. ఓట్ల సమీకరణాలను బేరీజు వేసుకొని పక్కా వ్యూహత్మకంగా జగన్ ను దెబ్బ కొట్టాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఇటీవల జనసేన-బీజేపీ మధ్య లుకలుకలు ఏర్పడుతున్నాయి.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా జనసేన పోరాటం చేస్తోంది. అలాగే ఈ రెండు పార్టీలు కలిసి పోరాటాలు కూడా చేయడం లేదు. దీనికితోడు జనసేన అధినేతపై సోము వీర్రాజు విమర్శలు చేస్తుండటంతో జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాబోయే ఎన్నికల నాటికి ఈరెండు పార్టీల మధ్య పొత్తు ఉండకపోవచ్చనే టాక్ విన్పిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు పార్టీల మధ్య వార్ చూస్తుంటే ఇది నిజమయ్యే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి.
Also Read: ఏపీలో సీజ్ చేసిన సినిమా థియేటర్లు తెరుస్తున్న ప్రభుత్వం.. దీనివెనుక పీపుల్స్ స్టార్