CM Jagan: ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్స్ ధరలు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం పరిశ్రమ పెద్దలకు తలనొప్పిగా మారింది. భారీ బడ్జెట్ చిత్రాలపై ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపుతుందని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో అధిక ధరలకు పెద్ద చిత్రాల హక్కులు దక్కించుకున్న డిస్ట్రిబ్యూటర్స్ గగ్గోలు పెడుతున్నారు. ఇక నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ ప్రభుత్వ పెద్దలతో సమావేశమైన వాస్తవ పరిస్థితులను వివరించారు. అదే సమయంలో తమ అభ్యర్థనలను విన్నవించడం జరిగింది.
ఏపీలో అమలవుతున్న టికెట్స్ ధరలపై వర్మ మొదటిసారి నోరు విప్పారు. ఆయన ఈ విషయంలో పరిశ్రమకు మద్దతుగా మాట్లాడారు. అదే సమయంలో సీఎం జగన్ నిర్ణయాలను తప్పుబట్టారు. టికెట్స్ ధరలు తగ్గిస్తే హీరోల రెమ్యూనరేషన్ తగ్గవు అన్నారు. హీరోలు లేకపోతే ప్రేక్షకులు థియేటర్స్ కి రారు. సినిమాను నిత్యావసర వస్తువుగా పరిగణించకూడదు. టికెట్ ధరలు తగ్గించడం వలన సినిమా క్వాలిటీ తగ్గిపోతుంది. భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించే ఆస్కారం ఉండదని తన అభిప్రాయం తెలియజేశారు. టికెట్స్ ధరల విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండకూడదని ఆయన కొంచెం ఘాటుగానే స్పందించారు.
Also Read: జగన్ ను జైలుకు పంపడానికి బీజేపీ రెడీ అయ్యిందా?
జగన్ కి వ్యతిరేకంగా వర్మ చేసిన ఈ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి . దానికి కారణం వర్మ జగన్ మనిషని చాలా కాలంగా ఓ వాదన ఉంది. నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేస్తూ వర్మ సినిమాలు తెరకెక్కిస్తూ ఉంటారు. వాళ్ళను పోలిన పాత్రలతో వర్మ తెరకెక్కించే స్పూఫ్ చిత్రాలు ఫ్యాన్స్ మనోభావాలను దెబ్బతీస్తూ ఉంటాయి.లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, పవర్ స్టార్ చిత్రాలు దీనిలో భాగమే. వర్మ ఇదంతా ఉద్దేశ పూర్వకంగా చేస్తున్నారని, పవన్, చంద్రబాబు, లోకేష్ వ్యక్తిత్వాన్ని, ఇమేజ్ ని దెబ్బతీయడం ద్వారా జగన్ కి మేలు చేయాలనేదే వర్మ ఉద్దేశమని యాంటీ ఫ్యాన్స్ వాదన.
ఇక వర్మ సినిమాలకు వైసీపీ వాళ్ళు పెట్టుబడి అందిస్తారని పవన్ ఫ్యాన్స్ అంటూ ఉంటారు. ఒక్కసారి కూడా వర్మ జగన్ పై నెగిటివ్ కామెంట్స్ చేయకపోవడంతో ఇందులో నిజం ఉందని నమ్మేవారు లేకపోలేదు. అయితే టికెట్స్ ధరల విషయంలో జగన్ పై దాడికి దిగిన వర్మ.. గతంలో ఉన్న పుకార్లకు చెక్ పెట్టారు. తనకు ఎక్కువ తక్కువ అంటూ ఎవరూ ఉండరని, అభిప్రాయం ఏదైనా స్వేచ్ఛగా వెల్లడిస్తాడని నిరూపించుకున్నాడు.
Also Read: ఏపీతో ఒప్పందాలు.. తెలంగాణలో పెట్టుబడులు..