Homeజాతీయ వార్తలుTPCC Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ గెలిచే సీట్లపై రేవంత్ కొత్త లెక్కలు..

TPCC Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ గెలిచే సీట్లపై రేవంత్ కొత్త లెక్కలు..

TPCC Revanth Reddy: తెలంగాణలో మరి కొద్ది రోజుల్లో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనే ఊహాగానాలు వినబడుతున్నాయి. ఈ విషయమై గత కొద్ది రోజుల నుంచి వివిధ రాజకీయ పార్టీల నేతలు అంటున్నారు. ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా బీజేపీ తెలంగాణ నేతలకు ఈ విషయం చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నేతలు ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇకపోతే తెలంగాణ కాంగ్రెస్ కమిటీ చీఫ్ (టీపీసీసీ) రేవంత్ రెడ్డి కూడా గతంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే పార్టీని ఆ దిశగా సమాయత్తం చేస్తున్నారని టాక్.

TPCC Revanth Reddy
TPCC Revanth Reddy

తెలంగాణలో ఉన్న అసెంబ్లీ సీట్ల దృష్ట్యా ఏదేని రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలంటే 60 సీట్లు గెలవాలి. కాగా, ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం సరికొత్త లెక్కలు వేసుకుందని తెలుస్తోంది. రేవంత్ అంచనాల ప్రకారం.. ఈ సారి 40 సీట్లు గెలిస్తే చాలు.. తాము అధికారంలోకి వచ్చినట్లే అన్న అభిప్రాయం రేవంత్ వ్యక్తం చేశారని సమాచారం. అందుకు కూడా లెక్కలు వేసుకున్నారట.

Also Read:  ‘దళిత బంధు’కు బ్రేకులు.. పట్టాలెక్కేది ఎప్పుడు?

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల్లో సీనియర్ నేతలు కంపల్సరీగా గెలుస్తారని అంచనాలు వేసుకున్నారట. ఈ క్రమంలోనే వారికి తోడుగా మరో 40 సీట్లు గెలిస్తే చాలని అనుకున్నారట.

కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, జానారెడ్డి, గీతారెడ్డి వంటి వారు ఈ సారి కంపల్సరీగా ఎలక్షన్స్ గెలుస్తారని, వారికి తోడుగా మరో40 మంది అభ్యర్థులను విజయం దిశగా నడిపించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితులపై రేవంత్ సర్వేలు కూడా చేయించుకున్నట్లు టాక్. ఈ క్రమంలోనే రేవంత్ ప్లాన్ ప్రకారం.. ఈ సారి పకడ్బందీగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో నికరంగా నిలబడి విజయం సాధిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉండే అసంతృప్తిని ఏ మాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగాలని రేవంత్ భావిస్తున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం తీసుకొచ్చిన నేతగా రేవంత్‌ను కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ, రేవంత్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కంటే కూడా సొంత ఇమేజ్‌పైనే ఆధారపడి ముందుకు సాగుతున్నారని కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకుగాను రేవంత్ తనదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జోష్ నింపుతున్నారు.

Also Read:   జియో యూజర్లకు అలర్ట్.. ఈ విధంగా మోసపోయే అవకాశాలు ఎక్కువట?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Exit mobile version