Homeఅప్పటి ముచ్చట్లుSrividya: బెడ్ రూమ్ సీన్స్ చేసినా సిస్టర్ గానే చూశారు

Srividya: బెడ్ రూమ్ సీన్స్ చేసినా సిస్టర్ గానే చూశారు

Srividya: ఇప్పటి సినిమాల్లో బికినీలు, పరిధి దాటిన సన్నివేశాలు సర్వసాధారణ అయిపోయాయి. కానీ, నలభై ఏళ్ల క్రితం ఒక నటి బికినీ వేసింది అంటే.. అప్పటికీ అది పెద్ద వింత. ఆ హీరోయిన్ గురించి ఒక దశాబ్దం పాటు చెప్పుకునేవారు. పైగా ఒక సహజ నటి అలాంటి నిర్ణయం తీసుకుంది అంటే.. అది నేటికీ షాకే. ఇంతకీ ఎవరు ఆ నటి ? మంచి నటిగా పేరు ఉన్న ఆమె ఎందుకు పరిధి దాటింది ? అసలు ఆమె ఓవర్ ఎక్స్ పోజింగ్ ఆమె కెరీర్ కి ప్లస్ అయ్యిందా ? లేక, ఇబ్బందులకు గురి చేసిందా ? వంటి ఆసక్తికర విషయాలు ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

Srividya
Srividya

నటన అంటే సహజత్వం ఉండాలి. సౌత్ లో సహాయ నటీమణుల్లో అలాంటి సహజ నటి అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ‘శ్రీవిద్య’. ఎన్నో సినిమాల్లో, మరెన్నో భాషల్లో మహానటి సావిత్రిగారి తర్వాత అంతటి స్థాయిలో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైన ఫ్యామిలీ హీరోయిన్ శ్రీవిద్య. ఆ రోజుల్లో జయప్రద, శ్రీదేవి, జయసుధ తమ అందచందాలతో అప్పటి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తూ… శ్రీవిద్యకు గట్టి పోటీ ఇచ్చారు.

Srividya
Srividya

Also Read: RRR New Party: ‘ఆర్ఆర్ఆర్’ కొత్త పార్టీ.. ఎన్టీఆర్ పై త్రివిక్రమ్ షాకింగ్ కామెంట్స్ !

దాంతో ఆమె హీరోయిన్ గా ఎక్కువ చిత్రాలు చేయలేకపోయారు. ఐతే, తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడానికి ఆమె ఎంతో కష్టపడ్డారు. అయినా ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. నిరుత్సాహం ఆమెను ఆవహించింది. దీనికి తోడు ఆమె వ్యక్తిగత జీవితం మోసాల పరంపరలో పూర్తిగా చితికిపోయింది. నేటి విశ్వ నటుడిగా పేరొందిన అప్పటి యంగ్ హీరో ఆమెను అన్నీ రకాలుగా వాడుకుని తన సరదా తీర్చుకున్నాడు.

Srividya
Srividya

ఆమె సినీ కెరీర్ ను పరదా చాటుకి నెట్టేశాడు. ఆ బాధను భరించలేక శ్రీవిద్య మద్యానికి బానిస అయింది. మత్తుకి చిత్తు అయిన ఆమె పరిస్థితి గ్రహించిన మరో దర్శకుడు ఆమెను వ్యాపార వస్తువుగా మార్చాలనుకున్నాడు. ఓ మలయాళ సినిమాలో ఆమె చేత ఓవర్ ఎక్స్ పోజింగ్, మరియు బి గ్రేడ్ సీన్స్ చేయించాడు. నిండా మునిగాక ఇక చలి ఏముంది ? ఆ తర్వాత శ్రీవిద్య కూడా ఆ రోజుల్లోనే బెడ్ రూమ్ సీన్స్ చేస్తూ బికినీ వేసి అప్పటి యూత్ కి తనలోని గ్లామర్ ను పరిచయం చేసింది.

Srividya
Srividya

ఐతే, బెడ్ రూమ్ సీన్స్ చేసినా ఆమెను మాత్రం ఎక్కువగా సిస్టర్ రోల్స్ నటిగానే చూశారు. హీరోయిన్ గా అవకాశాలు ఇవ్వలేదు. అయినా తనకు ఎన్ని కష్టాలు వచ్చినా శ్రీవిద్య మాత్రం వెనకడుగు వేయలేదు. తల్లి పాత్రలు చేయడానికి ఆమె ముందుకు వచ్చింది. దళపతిలో రజినీకాంత్ కి తల్లిగా నటించి తన నటనతో ప్రేక్షక హృదయాలను ఆకట్టుకుంది. ఐతే, అది 2003వ సంవత్సరం. శ్రీవిద్యకు శారీరిక ఇబ్బందులు మొదలయ్యాయి. బయాప్సీ పరీక్ష చేయించుకుంటే.. రొమ్ము క్యాన్సర్ అని తేలింది. ఒంటరి జీవితం, దీనికితోడు ప్రాణం తీసే రోగం.. ఎంతో నరకం అనుభవించింది. చివరకు క్యాన్సర్‌ ఆమెను కబలించింది. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.

Also Read: #RC15 Update: రామ్ చరణ్ తో అమృత్‌ స‌ర్‌ లో స్టార్ట్ చేసిన శంకర్ !

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular