Bigg Boss Telugu OTT: బిగ్ బాస్‌లో రోజురోజుకూ ఆసక్తికర పరణామాలు చోటుచేసుకుంటున్నాయి. మొదటి నుంచి గొడవలతో రసవత్తరంగా సాగుతోంది బిగ్ బాస్ షో. ఇకపోతే మరోసారి ఆరోవారంలో ఇలాంటి ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా రోబో టాస్క్ ఆద్యంతం రంజుగానే సాగింది. గ్రూపు రాజకీయాలు ఇందులో స్పష్టంగా కనిపించాయి.

ఈ టాస్క్ లో ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ గ్రూపులు మార్చేశారు. యాంకర్ స్రవంతి మొదటి నుంచి అఖిల్ బ్యాచ్ తోనే ఉంది. కాగా వారితో గొడవ పెట్టుకుని బయటకు వచ్చేసింది. బిగ్ బాస్ రోబో ఫ్యాక్టరీ టాస్క్ అప్పగించాడు. ఇందులో చాలామంది బలప్రయోగానికి పాల్పడ్డారు. ఇక స్రవంతి అయితే ఈ టాస్క్ లో బొక్క బోర్లా పడిపోయింది.
దాంతో పాటు గతంలో అఖిల్ తనను దూరం పెట్టేందుకు ప్రయత్నించాడు కూడా. వీటిని మనసులో పెట్టుకున్న స్రవంతి అషు రెడ్డికి కాకుండా అరియానాకు సాయం చేసింది. కాగా మధ్యలో రోబో పార్ట్ లను ఎత్తుకెళ్లేందుకు కూడా ప్రయత్నించింది. అయితే ఈ టాస్క్ ముగిసే సమయానికి ఎవరి వద్ద ఎన్ని కాయిన్స్ ఉన్నాయో చెప్పాలంటూ బిగ్ బాస్ ఆర్డర్ వేశాడు.
అయితే ఈ టాస్క్‌లో సంచాలకుడిగా ఉన్న మహేష్ ఓ రూల్ ను చెప్పాడు. బజర్ రింగ్ అయ్యాక ఒకరి దగ్గర ఉన్న కాయిన్స్ మరొకరు మార్చుకోవొద్దు అంటూ చెప్పాడు. కానీ ఈ రూల్ ను అతిక్రమించి అఖిల్ అజయ్ కు కాయిన్స్ ఇచ్చాడంటూ యాంకర్ స్రవంతి చెప్పింది. అయితే ముందు బుకాయించడానికి ప్రయత్నించిన అఖిల్ బ్యాచ్.. ప్రత్యేకంగా మాట్లాడినప్పుడు నిజాన్ని ఒప్పుకున్నారు.

కాగా స్రవంతి అలా చెప్పడంతో అజయ్ ఆమె మీద సీరియస్ అయ్యాడు. నువ్వు అలా చేసినప్పుడు మేము నీ గురించి ఏమైనా చెప్పామా అంటూ అడిగాడు. దీంతో అతని మాటలకు స్రవంతి ఫీల్ అయిపోయింది. ఈ క్రమంలో ఆమె చూసింది చెప్పడం కూడా తప్పేనా అంటూ వాపోయింది. పైగా ఎవరు గ్రూపో ఎవరు పక్కోళ్లో అర్థం కావట్లేదంటూ ఏడ్చేసింది.