https://oktelugu.com/

India-Myanmar Border : దేశం సరిహద్దుకి కంచె వేయొద్దని నాగా, మిజో ముఖ్యమంత్రులు అభ్యంతరం

దేశం సరిహద్దుకి కంచె వేయొద్దని నాగాలాండ్, మిజోరం ముఖ్యమంత్రులు అభ్యంతరం ఎందుకు చెబుతున్నారు.? కారణం ఏంటన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : February 10, 2024 7:02 pm

    India-Myanmar Border : రెండు రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. 1634 కి.మీల భారత్-మయన్మార్ సరిహద్దుకు కంచె వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇదేదో మామూలు విషయం కాదు.. ఆర్థికంగా ఎంత ఖర్చు అవుతుందని పక్కనపెడితే.. ఈశాన్య సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కంచె వేయడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే.. పాకిస్తాన్-భారత్ కు మధ్య 3323 కి.మీల సరిహద్దు ఉంటే 2064 కి.మీలు ఫెన్సింగ్ వేశారు. బంగ్లాదేశ్ తో 3180 కి.మీల బార్డర్ ఉంది.. ఆ దేశం చుట్టూ కూడా కావాల్సినంత ఫెన్సింగ్ వేశారు. నేపాల్ కు 1770 కి.మీలు ఉంది. పూర్తిగా ఓపెన్ బార్డర్.. అందుకే నేపాల్ నుంచి భారత్ లోకి ఇల్లీగల్ ఇమిగ్రేంట్స్ భారత్ లోకి వస్తున్నారు.

    మయన్మార్ 1634 కి.మీల సరిహద్దు భారత్ తో ఉంది. అయితే 16 కి.మీలు అటూ ఇటూగా వీసా లేకుండా ప్రజలు వెళ్లొచ్చు. ఎందుకంటే.. డ్రగ్ ట్రాఫికింగ్ బాగా జరుగుతోంది. మత్తు మందు పదార్థం రవాణా అవుతోంది. కొకైన్ డ్రగ్స్ , గంజాయి సాగు అవుతోంది. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ విపరీతంగా జరుగుతోంది.

    మణిపూర్ గొడవకు సగం కారణం మయన్మార్ నుంచి వచ్చిన వారే.. వాటితోపాటు కొత్త సమస్య వచ్చింది. మయన్మార్ లో అంతర్యుద్ధం జరుగుతోంది. రోహింగ్యాలు, ఇతరులు భారత్ లోకి వస్తూ ఇక్కడ అలజడి రేగుతోంది. అంతర్యుద్ధం 60వేల మంది భారత్ లోకి ఎంటర్ అయ్యారు. అందుకే కంచె వేస్తే భారత్ లో అలజడులు తగ్గుతాయి.

    దేశం సరిహద్దుకి కంచె వేయొద్దని నాగాలాండ్, మిజోరం ముఖ్యమంత్రులు అభ్యంతరం ఎందుకు చెబుతున్నారు.? కారణం ఏంటన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

    దేశం సరిహద్దుకి కంచె వేయొద్దని నాగా, మిజో ముఖ్యమంత్రులు అభ్యంతరం || India-Myanmar Border || Ram Talk