Comedian Sunil: సునీల్ పరిశ్రమకు వచ్చి పాతికేళ్ళు అవుతుంది. 2000లో విడుదలైన బ్లాక్ బస్టర్ నువ్వే కావాలి చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు. దర్శకుడు తేజ తెరకెక్కించిన నువ్వు నేను మూవీతో సునీల్ కి బ్రేక్ వచ్చింది. పరిశ్రమకు మరో మంచి కమెడియన్ దొరికాడని జనాలు ఫిక్స్ అయ్యారు. నువ్వు నాకు నచ్చావ్, మనసంతా నువ్వే, నువ్వు లేక నేను లేను చిత్రాల్లో సునీల్ కామెడీ కడుపుబ్బా నవ్వించింది. స్టార్ కమెడియన్స్ లో ఒకడిగా సునీల్ సెటిల్ అయిపోయాడు.
కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉండగా సునీల్ హీరో అవతారం ఎత్తాడు. అందాల రాముడు మూవీతో హీరో అయ్యాడు. అనంతరం రాజమౌళి దర్శకత్వంలో మర్యాద రామన్న మూవీ చేశాడు. ఇవి రెండు విజయం సాధించాయి. రామ్ గోపాల్ వర్మతో కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు మూవీ చేశాడు. ఇది ఆశించిన స్థాయిలో ఆడలేదు. హీరోగా పూల రంగడు మూవీతో మరో హిట్ కొట్టాడు. అయితే తర్వాత సునీల్ కి హిట్ పడలేదు. వరుస పరాజయాలతో అయోమయంలో పడ్డాడు.
లాభం లేదని బ్యాక్ టు కమెడియన్ రోల్స్ కి వచ్చేశాడు. అలాగే విలన్, క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ వర్సటైల్ యాక్టర్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం సౌత్ ఇండియా మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ అయ్యాడు. తెలుగుతో సమానంగా తమిళంలో సునీల్ కి ఆఫర్స్ వస్తున్నాయి. గత ఏడాది తెలుగు, తమిళ భాషల్లో డజను చిత్రాలు చేశాడు. వాటిలో జైలర్, మార్క్ ఆంటోని వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు ఉన్నాయి.
నెక్స్ట్ ఆయన పుష్ప 2లో కనిపించనున్నాడు. అయితే సునీల్ ఉచితంగా సినిమాలు చేస్తున్నాడని, ఆయనకు ఆఫర్స్ రాకపోవడంతో ఇలా చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఈ పుకార్లలో నిజం ఉండే అవకాశం లేదు. సునీల్ ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్. రోజుకు లక్షల్లో ఆయన రెమ్యూనరేషన్ ఉంది. విలన్ గా కూడా సక్సెస్ అయ్యాడు. కాబట్టి అవకాశాలు లేని సునీల్ ఉచితంగా సినిమాలు చేస్తున్నాడనేది అబద్ధం. పుష్ప 2లో మంగళం శ్రీనుగా మరోసారి ఆయన విలనిజం పండించనున్నాడు.