Homeఅంతర్జాతీయంRussia Ukraine war: ఒంటరివాడైన పుతిన్..: పరాభావం తప్పదా..?

Russia Ukraine war: ఒంటరివాడైన పుతిన్..: పరాభావం తప్పదా..?

Russia Ukraine war:  ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం ప్రపంచంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్ పై ఆధిపత్యం కోసం రష్యా చేస్తున్న యుద్ధంతో ప్రపంచం రెండుగా చీలుతోంది. అయితే మెజార్టీ దేశాలు ఉక్రెయిన్ కే మద్దతుగా నిలుస్తున్నాయి. ఉక్రెయిన్ ధీటుగా ఎదుర్కోకపోయినా ప్రపంచ దేశాలు మాత్రం ఆ దేశానికి మద్దతు ఇస్తున్నాయి. ఉక్రెయిన్ పై సానూభూతి చూపుతూ వివిధ దేశాల్లో శాంతి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు రష్యాపై నిరసన వ్యక్తం అవుతోంది. రష్యాలోనూ పుతిన్ కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగడం గమనార్హం. అటు ప్రపంచ దేశాలు సైతం పుతిన్ ను అనేక వ్యవహారాల్లో దూరం పెడుతుండడంతో రష్యా ఇప్పుడు ఒంటరి దేశంగా మారింది.  అమెరికా తరువాత అంతటి పెద్ద దేశంగా మార్చుదామనుకున్న పుతిన్ కు ఇది ఊహించినదానికంటే ఎక్కువే పరాభావాన్ని మిగిల్చుతోంది.

Russia Ukraine war
Putin

ప్రపంచంలో పుతిన్ వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంంది. ఆయన తీసుకునే నిర్ణయాలు రష్యాకు నష్టమే మిగుల్చుతున్నాయి. ఆర్థిక, ఇతర వ్యవహారాల్లో ప్రపంచ దేశాలు రష్యాను బహిష్కరించడంతో ఆ దేశం అల్లకల్లోలంగా మారుతోంది. సామాజిక, ఆర్థిక వ్యవహారాల్లోనూ రష్యా ఇప్పుడు దిగజారుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ప్రపంచ పెద్దన్నగా మారిన అమెరికా స్థానాన్ని ఆక్రమించాలన్న పుతిన్ కలలు కల్లలుగానే మారుతున్నాయి. ఈ యుద్ధంతో పుతిన్ ఒంటరిగా మారుతున్నారు. ఒక వేళ యుద్ధం నుంచి వెనక్కి వెళ్లినా తన పరువు మొత్తం పోయే పరిస్థితి ఎదురైంది. అణ్వాయుధాలు అని హెచ్చరికలు జారీ చేసినా అది మొదటికే మోసం వచ్చే అవకాశంగా మారింది.

రష్యాకు దాదాపు జీవితకాలం అధ్యక్షుడిగా ఉండాలని పుతిన్ దేశ రాజ్యాంగాన్ని సైతం మార్చేశాడు. ప్రపంచంలో శక్తివంతమైన నాయకుడిగా మారిన పుతిన్ 1952లో జన్మించారు. లెనిణ్ గ్రాండ్ స్టేట్ యూనివర్సిటీలో చదివిన ఆయన సోవియట్ గూడాఛారి సంస్థ అయిన కేజీబీలో నిఘా అధికారిగా పనిచేశారు. అలా 16 ఏళ్లు గడిచిన తరువాత పుతిన్ ఉన్నత స్థాయి నాయకులకు దగ్గరయ్యాడు. రాజకీయాలపై ఆసక్తి పెరిగి 1991 లో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో చేరిపోయారు. అప్పటి అధ్యక్షుడు బోరిస్ ఎల్సిన్ కోటరీలో ముఖ్యనేతగా ఎదిగారు.

Also Read: KCR National Politics: జాతీయ రాజకీయాలపై ‘కేసీఆర్’ అసలు ప్లాన్ ఇదే!

 

మిగత నాయకుల కంటే భిన్నంగా పుతిన్ అతి తక్కువ సమయంలోనే రాజకీయంలో ప్రావీణ్యం సాధించారు. 1999 డిసెంబర్ 31న రష్యా ప్రధానికగా ఎన్నికయ్యాడు. అప్పటి నుంచి తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి అనేక రాజకీయ ఎత్తులు వేశారు. అయితే ప్రధాని, లేదా అధ్యక్ష పదవిలో కొనసాగుతూ వస్తున్నాడు. ఆయన ఏ పదవిలో ఉన్నా తనదే పైచేయిగా ఉంటుంది. 2000 సంవత్సరం నుంచి 2004 వరకు అధ్యక్షుడిగా.. 2004 నుంచి 2008 వరకు రెండోసారి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తరువాత 2008 నుంచి 2012 వరకు ప్రధాని గా పనిచేశారు. 2018లో రాజ్యాంగాన్ని మార్చి శాశ్వత అధ్యక్షడిగా ప్రకటించుకున్నారు. 2033 వరు తానే అధ్యక్షుడిగా ఉండేలా ప్రణాళిక వేశాడు.

Russia Ukraine war
Russia President

 

పుతిన్ రష్యాకు అధ్యక్షుడి మారిన తరువాత ఆగిపోలేదు. ప్రపంచం మొత్తం తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు శాయశక్తుగా కృషి చేస్తున్నాడు. ముఖ్యంగా అమెరికాకు ధీటుగా నిలబడాలన్నదే ఆయన లక్ష్యం. ఇందులో భాగంగా అమెరికాను శత్రువుగా చూస్తూ వచ్చాడు. ఇక దేశంలో తన ప్రత్యర్థులను పూర్తిగా అణగదొక్కాడు. అయితే ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా పుతిన్ కు ఎదురొడ్డి నిలిచిన అలెక్సీ నవల్నీకి సైతం పుతిన్ చుక్కలు చూపించాడు.

Also Read: Naveen Polishetty, Sithara Entertainments: అడ్వాన్స్ తిరిగిచ్చి ఆ నిర్మాతకు షాకిచ్చిన ‘జాతిరత్నాలు’ హీరో

అయితే పుతిన్ ప్లాన్ ఇప్పుడు రివర్స్ అవుతోంది. అమెరికాను నిలవరించాలన్న ఉద్దేశంతో పుతిన్ ఉక్రెయిన్ ను పావుగా వాడుకున్నాడు. సిరియాలో అమెరికా జోక్యానికి అడ్డుకట్ట వేసి పాత సోవియట్ యూనియన్ ను గుర్తు చేశాడు. అయితే ప్రస్తుతం ఉక్రెయిన్ పై జరుగుతున్న యుద్ధంతో పుతిన్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా అమెరికా, జర్మనీ లాంటి దేశాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా సొంత దేశంలోనూ పుతిన్ కు వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. అసలే అంతంత ఆర్థిక పరిస్థితి ఉన్న రష్యాకు తాజా యుద్ధ వాతావరణంతో మరించి ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది. దీంతో రానురాను పుతిన్ కు పరాభావం తప్పదని విశ్లేషకులు అంటున్నారు.

Recommended video:

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular