Bigg Boss OTT: గంట సేపు వస్తేను ఉర్రూతలూగే షో బిగ్ బాస్. అలాంటిది 24 గంటలూ ఓటీటీ ఫ్లాట్ పామ్ ‘హాట్ స్టార్’లో వస్తుండడంతో ప్రేక్షకులు ఆ మజాను ఎంజాయ్ చేస్తున్నారు. టీవీలు/మొబైళ్లకు అతుక్కుపోతున్నారు. రెండో రోజు నుంచే బిగ్ బాస్ ఓటీటీలు గొడవలు మొదలైపోయాయంటే ఎంత ఎంటర్ టైన్ మెంట్ పంచుతుందో అర్థం చేసుకోవచ్చు.

బిగ్ బాస్ సీజన్ 4లో అరియానా, అవినాష్ లవ్ ట్రాక్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. హౌస్ లో ఉన్నంత సేపు వాళ్ల మధ్య జరిగిన లవ్ ట్రాక్ అందరికీ నచ్చింది. దీంతో బయటికి వచ్చాక అది అలాగే కంటిన్యూ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ.. అది కంటిన్యూ కాలేదు. ఇద్దరూ విడిపోయారు. అవినాష్ వేరే అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నాడు.
Also Read: రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, సర్కారి వారి పాట, ఆచార్య లలో ఏది సూపర్ హిట్ సినిమా?
ఇక ఈ మద్యే మొదలైన బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీలోకి అరియానా ఎంట్రీ ఇచ్చింది. రావడం రావడమే.. రెండు రోజులకే హౌస్ లో ఉన్న చాలెంజర్ అజయ్ ని చూసి పడిపోయింది. చాలెంజర్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి కంటెస్టెంట్ అజయే.
అజయ్ సినిమా నటుడు. ఇప్పటి వరకు కొన్ని సినిమాల్లో నటించాడు. చూడటానికి తెల్లగా, హైట్ తో అజయ్ ఉండటంతో పాటు.. అందరితోనూ మంచిగా ఉంటూ.. మంచి పిల్లాడు అని అజయ్ అనిపించుకుంటున్నాడు. అయితే.. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత వారియర్స్, చాలెంజర్స్ వీళ్లకు ఎవరిలో అనుబంధం ఏర్పడింది. ఎవరితో ఉంటే బాగుంటుంది అని అనిపించిందో వాళ్ల పేరు చెప్పి.. ఎందుకు వాళ్లను ఎంచుకున్నారో చెప్పాలంటూ బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తాడు. దీంతో అరియానా.. ఏమాత్రం గుక్కతిప్పుకోకుండా అజయ్ పేరు చెప్పేసింది.

తెల్లచొక్కా.. స్టార్టింగ్ నుంచి అజయ్ వైబ్ నచ్చింది. ఆయన వైబ్ నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. స్పాంటెనిటీ కూడా నచ్చింది అని చెప్పింది అరియానా. మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 4 టాప్ 5 కంటెస్టెంట్ , ఫైర్ బ్రాండ్ అయిన అరియానా అజయ్ ప్రేమలో మునిగితేలుతోంది.
Also Read: రామారావ్ ఆన్ డ్యూటీ: నేరస్తుల తాట తీస్తున్న రవితేజ
[…] Bigg Boss OTT Telugu: బిగ్ బాస్ మొదలైన నాలుగో రోజే కంటెస్టెంట్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు పొడచూపుతున్నాయి. దానికి తోడు చాలెంజర్స్ వర్సెస్ వారియర్స్ అనే టాస్కులతో బిగ్ బాస్ కూడా కాస్తంత పెట్రోల్ పోసి చలి కాచుకుంటున్నారు. అది ప్రేక్షకులకు బాగానే వినోదాన్ని పంచుతున్నా ఇంటి సభ్యుల మధ్య మాత్రం గొడవలతో బూతు బాగోతం నడుస్తోంది. […]
[…] Bigg Boss Non Stop Anchor Shiva: గొడవలకు నాటకీయ కోణాలు జోడించడంలో ‘బిగ్ బాస్’ దిట్ట. హౌస్ లో బిగ్ బాస్ ఎప్పుడు ఎవరి మధ్య ఎలాంటి గొడవలు పెడతాడో, అలాగే ఎవర్ని ఎప్పుడు స్నేహితులుగా మారుస్తాడో ప్రేక్షకులే కాదు.. కంటెస్టెంట్లు కూడా ఊహించలేరు. పైగా, ప్రస్తుతం జరుగుతుంది బిగ్ బాస్ నాన్ స్టాప్. అందుకే ఈ హౌస్ లో ఎవరికి వారు హైలెట్ అవ్వాలని చాలా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ క్రమంలో ఎవరికీ వారు రెచ్చిపోతున్నారు. […]
[…] Varun Tej Ghani Movie Release Date: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిస్క్ చేసి మరీ బాక్సింగ్ నేపథ్యంలో చేస్తోన్న సినిమా ‘గని’. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఈ సినిమాను ఏప్రిల్ 8న విడుదల చేయనున్నట్లు గీతా ఆర్ట్స్ ప్రకటించింది. స్పోర్ట్స్ డ్రామాతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తొలుత డిసెంబర్ 24,2021న రిలీజ్ చేయాలనుకోగా కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఫిబ్రవరి 25న విడుదల చేస్తామని చెప్పగా, భీమ్లానాయక్ వల్ల పోస్ట్‌పోన్ అయింది. తాజాగా ఏప్రిల్ 8న రిలీజ్ అవుతుందని ప్రకటించారు. […]