Kendriya Vidyalaya: కేంద్రీయ విద్యాలయ సీఆర్‌పీఎఫ్-బార్కస్ అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. https://hyderabadcrpf.kvs.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మార్చి నెల 8, 9 తేదీలలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి.

హైదరాబాద్ బార్కస్‌లోని కేంద్రీయ విద్యాలయంలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇంటర్వ్యూలు జరగనున్నాయి. అకడమిక్ సర్టిఫికేట్లను తీసుకొని ఈ ఉద్యోగ ఖాళీలకు ఇంటర్వ్యూ కోసం హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్ తో పాటు ఏదైనా డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సోషల్ స్టడీస్, సంస్కృతం, మ్యూజిక్ విభాగాలతో పాటు ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్ విభాగాలలో ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఖాళీలు ఉన్నాయి.
క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ టీచర్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కోచ్, కౌన్సెలర్ ఉద్యోగ ఖాళీలతో పాటు టీజీటీ, ప్రైమరీ టీచర్స్, పీఆర్‌టీ, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, పీజీటీ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. అనుభవం ఉన్న ఉద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
Also Read: Bheemla Nayak Collections: భీమ్లానాయక్ కలెక్షన్ల వర్షం: 4వ రోజు కలెక్షన్లు ఇవీ
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు అర్హతకు తగిన వేతనం లభించనుంది. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశాలు ఉంటాయి. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది.
Recommended Video:
Also Read: ఉక్రెయిన్ నుంచి బయటపడడానికి ‘భారత్ మాతాకి జై’ నినాదాలు చేస్తున్న పాకిస్తాన్ విద్యార్థులు