Nara Lokesh : ‘పండిత పుత్ర.. పరమ సుంఠ’ అంటారు. అంటే పండితుడికి పుట్టిన వాడు ప్రయోజకుడు కాడు.. పప్పు సుద్ద అవుతాడని మన చరిత్రలో ఎన్నో సార్లు రుజువైంది. కడుపున పుట్టిన పిల్లల్లో ఒకరో ఇద్దరో మాత్రమే జెమ్స్ ఉంటారు. మిగతా వాళ్లు పప్పుసుద్ధల్లా మిగిలిపోతారు. ఎందుకో కానీ చంద్రబాబులోని గ్రేస్, రాజకీయం ఆయన సుపుత్రుడు లోకేష్ లో రాలేదు అనిపించేలా కనిపిస్తున్నాయి.. ‘లోకేషం’ మేలిమి బంగారం అని టీడీపీ వాళ్లు అంటున్నారు.. పప్పు అన్నది సార్థక నామధేయం అని వైసీపీ వాళ్లు అంటున్నారు… చంద్రబాబు ఎంత టాలెంటెడ్ నో.. ఆయన కుమారుడు లోకేషం అంత అమాయకుడని అంటున్నారు.
లోకేష్ ఎంత అమాయకుడంటే ప్రజలు సమస్యలు చెప్పడానికి వస్తే అది వదిలేసి తనకు ఇష్టమైన బిర్యానీ గురించి చెప్పేంత వెర్రితనం.. బేలతనం ఆయన సొంతం.. లోకేష్ ను చూస్తుంటే అప్పుడప్పుడు అసలు ఈయన రాజకీయ నాయకుడిగా రాజకీయాల్లో ఉండాల్సింది కాదు.. సినిమాల్లో బ్రాహ్మనందం పక్కన ఉండాల్సిందన్న డౌట్ కూడా రాకమానదు. మరీ ఇంత కూడా లోకజ్ఞానం లేని లోకేష్ ను చూసి ఇప్పుడు నెటిజన్లు నవ్వుకుంటున్నారు.
ప్రస్తుతం ఎండలోపడి బిజీగా ఏపీ అంతా పాదయాత్ర చేసేస్తున్నాడు మన లోకేష్ బాబు. చంద్రబాబు వయసైపోవడంతో కొడుకును రోడ్డుమీదకు పంపాడు. పోనీ లోకేష్ యాత్ర ఏమైనా బాగా జరుగుతుందా? అంటే అదీ లేదు. జనాలు చెప్పేది లోకేష్ కు అర్థం కాదు.. లోకేష్ ఏం చెబుతున్నాడో జనాలకు అర్థం కాదు. సమస్యలను అర్థం చేసుకోకుండా పాపం లోకేష్ ఏదేదో చెబుతుంటాడు..
తాజాగా లోకేష్ పాదయాత్రకు సమస్యలు చెప్పుకుందామని ఓ మైనార్టీ ముస్లిం మహిళ వచ్చింది. తన సమస్యలు ఇవీ అని చెప్పుతుండగా.. ఆపేసిన లోకేష్ ఆ మైనార్టీ ముస్లిం మహిళలకు సంబంధం లేని విషయం చెప్పాడు.. ‘నేను లావు కావడానికి సగం కారణం బిర్యానీనే.. హైదరాబాద్ బిర్యానీ అంటే నాకు మనసులో ప్రత్యేక స్థానం ఉంది. బిర్యానీ, హలీమ్, డబుల్ కా మీటా అంటే కూడా బాగా ఇష్టం. ఈ మూడు నాకు చాలా ఇష్టం. ’ అంటూ ఆ మహిళకు బదులిచ్చాడు.
మహిళ సమస్యలు చెబుతుంటే లోకేష్ తన తిండి తిప్పలు పంచుకున్నాడు. సమస్యల పరిష్కారం కోసం ఆబగా వచ్చిన మహిళ లోకేష్ ఏం చెబుతున్నాడో అర్థం కాక బేల చూపులు చూసింది. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన వారంతా లోకేష్ వెర్రితనానికి నవ్వాలో ఏడవాలో అర్థం కాక తలపట్టుకున్నారు.