Kashmir Elections 2024
Jammu and Kashmir Elections : జమ్మూ కశ్మీర్ లో కూడా ఎన్నికల నగారా మోగింది. లోక్ సభ ఎన్నికలు అక్కడ జరుగునున్నాయి. 2019 లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇప్పటివరకూ ఎన్నికలు నిర్వహించలేదు. ఇక అక్కడ అసెంబ్లీ నిర్వహిస్తే సెక్యూరిటీ నిర్వహించడం కష్టమని భద్రతా కారణాలతో రద్దు చేశారు.
మొత్తం 5 పార్లమెంట్ నియోజకవర్గాలున్నాయి. లఢక్ ఒక నియోజకవర్గంగా పోయింది. 5 నియోజకవర్గాల్లో రెండు జమ్మూకు, 2 కశ్మీర్ లోయకు.. ఒకటి ఈ రెండు ప్రాంతాల మిక్స్ గా వచ్చాయి.
ఎన్నికలు ఎలా జరుగుతున్నాయని చూస్తే.. ఏప్రిల్ 19తో మొదలై మే 20 వరకూ ఒక్కో నియోజకవర్గానికి ఒక్కోసారి ఎన్నికలను ఇక్కడ నిర్వహిస్తున్నారు. భద్రతా కారణాలతో ఈ ఏర్పాట్లు చేశారు.
ఈ కశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది. జమ్మూ కశ్మీర్ లో జమ్మూ వైపు గంపగుత్తగా బీజేపీకి ఓట్లు వేస్తున్నారు. కశ్మీర్ వ్యాలీలోనూ వేస్తున్నారు. తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ పెద్ద పార్టీగా ఉంది. ఈ రెండు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. పీడీపీ సౌత్ కశ్మీర్ కు, పీపుల్స్ కాన్ఫరెన్స్ నార్త్ కశ్మీర్ వైపు పోటీలో ఉన్నాయి. ఇక్కడ వీటికి బలం ఉంది.
కాశ్మీర్ లో ఏయే పార్టీలు ఒంటరిగా, కూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.