KCR Social Media : తెలుగురాష్ట్రాల్లో బలమైన మీడియా అంతా టీడీపీకి ఫేవర్ గా ఉంది. చంద్రబాబు మీడియాను అడ్డుపెట్టుకొనే నాడు ఎన్టీఆర్ నుంచి నేటి వైఎస్ఆర్, జగన్ ల వరకూ చెడుగుడు ఆడేస్తున్నారు. తెలంగాణ విడిపోయిన కొత్తలో కూడా మీడియా కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేసింది. కానీ కేసీఆర్ నిషేధంతో కొరఢా ఝలిపించడంతో ఇప్పుడు దారికి వచ్చింది. పలు మీడియాలను టీఆర్ఎస్ అనుకూలురు చేజిక్కించుకోవడంతో ఇప్పుడు కేసీఆర్ కు ఎదురెళ్లే మీడియా తెలంగాణలో లేదు. కానీ ‘సోషల్ మీడియా’ ఇప్పుడా పనిచేస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ను నిజంగానే ‘సోషల్ మీడియా’ తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఆయన నిన్న ప్రెస్ మీట్ లో బీజేపీ చేస్తున్న సోషల్ మీడియా ప్రచారంపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ‘అది క్షుద్ర విద్యగా మారిందని.. సోషల్ మీడియా అంతు చూస్తానంటూ.. విరిచి పొయ్యిలో పెడతా’ అని శపథం చేశారు. ఇంతకీ కేసీఆర్ ను అసలు సోషల్ మీడియా ఎందుకు ఇంతలా షేక్ చేస్తోంది.

సోషల్ మీడియా పేరుతో తప్పుడు ప్రచారాలను చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. దళితబంధు పథకం మీకు కనపడడం లేదా? అని కేసీఆర్ నిలదీశారు. బీజేపీ వాళ్లు సొల్లు పురాణం సోషల్ మీడియా పేరుతో తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోవాల్నా అని బరస్ట్ అయ్యారు. సోషల్ మీడియా కాదు.. క్షుద్ర విద్యనంటూ దానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ఫక్తు సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకొని అందరికీ తమ పంథాను, తమ సిద్ధాంతాలను, బీజేపీ వ్యతిరేకుల లోపాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళుతోంది. ఈ క్రమంలోనే వాస్తవాలను కూడా లోపాలు వెతికి ప్రచారం చేస్తోందన్న ఆవేదన కేసీఆర్ లో ఉంది. దళితబంధు, రైతు బంధు మీద కూడా బీజేపీ సోషల్ మీడియా పడి ఇష్టమొచ్చినట్టు సొల్లు పురాణం సోషల్ మీడియాలో కుమ్మరిస్తుంటే కేసీఆర్ తట్టుకోలేక విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ క్రమంలోనే బీజేపీకి బలమైన సోషల్ మీడియాను కేసీఆర్ టార్గెట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని వదిలేది లేదని శపథం చేశారు.నిజానికి దేశంలో మోడీ ప్రధాని అయ్యాక మీడియా పవర్ తగ్గింది. పత్రికల ఊసే లేదు. అంతా సోషల్ మీడియా.. ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా బీజేపీ విధానాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళుతూ ప్రచారం చేస్తున్నారు.
ఇప్పుడు దేశంలో బీజేపీకి ఉన్న బలమైన సోషల్ మీడియా వింగ్, మద్దతుదారులు వేరే ఏ పార్టీకి లేదు.వారు చేసే ప్రచారాలు తప్పు అయినా ఒప్పించేలా రాస్తున్నారు.ప్రజల్లో కనువిప్పు కలిగిస్తున్నారు. ఈ క్రమంలోనే మోడీని హీరోగా.. దేశాన్ని ఉద్దరించడానికి వచ్చిన యుగపురుషుడిగా చూపిస్తున్నారు.
ఇదే క్రమంలోనే ప్రత్యర్థి పార్టీలను ఎందుకు పనికిరాని వాళ్లుగా చిత్రీకరిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు అయిన బండి సంజయ్ సైతం సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకొనే కేసీఆర్ ను, టీఆర్ఎస్ సర్కార్ ను టార్గెట్ చేసి పలుచన చేస్తున్నారు. అది వర్కవుట్ అయ్యి దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీలాంటి విజయాలు దక్కాయి. అందుకే ఇక బీజేపీని ఎదుర్కోవాలంటే సోషల్ మీడియాను ఖచ్చితంగా నియంత్రించాలని.. ఈ మేరకు దానిపై కేసీఆర్ యుద్ధం ప్రకటించారని చెప్పొచ్చు.
ఇప్పుడు కేసీఆర్ టార్గెట్ బీజేపీ కంటే ఆ పార్టీ సోషల్ మీడియా అనడంలో ఎలాంటి సందేహం లేదు. మంచి చేసినా దాన్ని తప్పు అని నిరూపిస్తున్న ఘనత బీజేపీ దే. అందుకే కేసీఆర్ తాజాగా ప్రెస్ మీట్ లో ‘సోషల్ మీడియాను క్షుద్రవిద్యగా’ పోల్చారు. తమ పార్టీ కూడా సోషల్ మీడియాలో అంతే ధీటుగా నిలబడేలా చేయాల్సింది పోయి ప్రత్యర్థి సోషల్ మీడియాను అణిచివేస్తానని ప్రకటించారు. మరి ఈ వార్ ఎటువైపు సాగుతుందో చూడాలి.
For LIVE News, National Updates, India News Watch:
[…] Also Read: KCR Social Media: కేసీఆర్ ను నిజంగానే సోషల్ మీడి… […]