Kashmiri terrorist organizations : హఫీజ్ సయిద్ ముఖ్య అనుచరుడి హతంతో భయంలో కాశ్మీరీ ఉగ్రవాద సంస్థలు

లష్కరే తోయిబా అధినేత, బాంబే పేలుళ్ల సూత్రధారి అయిన హఫీజ్ సయ్యిద్ కు దగ్గరైన సహ వ్యవస్థాపకుడు ముక్తి ఖైజర్ ఫరూక్ ను కాల్చిపడేశారు.

Written By: NARESH, Updated On : October 3, 2023 6:25 pm

కశ్మీరీ ఉగ్రవాదులు భారత్ లో ఇవ్వాళా వారిని ఏరిఏరి కాల్చిపారేస్తున్నారు. వారికి వెన్నుతట్టి ప్రోత్సహించి వారికి నిధులు సమకూరుస్తున్న పాకిస్తానీ ఉగ్రవాదులు వణికిపోతున్నారు. ఇటీవల పాకిస్తాన్ లో కాల్పుల్లో చనిపోతున్న పాకిస్తానీ ఉగ్రవాదుల సంఖ్య ఎక్కువగా ఉంది.

ఇప్పటికీ పాకిస్తాన్ అల్లకల్లోలంగా ఉంది. ఖైబర్ ఫంక్తూన్వా రీజియన్ కలిసి ఉంటుందో ఎప్పుడు స్వాతంత్ర్యం ప్రకటించుకుంటుందో తెలియని పరిస్థితి. బెలుచీస్తాన్ స్వతంత్ర దేశం అవుతుందో చెప్పలేని పరిస్థితి. వారి స్వంత గొడవల్లో సతమతమవుతున్న వారికి భారత్ లో ప్రేరిపిత కశ్మీర్ ఉగ్రవాదులకు ఎలా రక్షణ ఇవ్వాలో అర్థం కావడం లేదు. సైన్యం ఎంత కాపాడాలని చూసినా.. వారిని వెతికి వెతికి కాల్చిపారేస్తున్నారు. ఎందుకంటే ఈ వారంలో వరుస కాల్పులు జరిగాయి.

లష్కరే తోయిబా అధినేత, బాంబే పేలుళ్ల సూత్రధారి అయిన హఫీజ్ సయ్యిద్ కు దగ్గరైన సహ వ్యవస్థాపకుడు ముక్తి ఖైజర్ ఫరూక్ ను కాల్చిపడేశారు. బాంబే పేలుళ్ల సూత్రధారుల్లో ప్రధాన వ్యక్తి. ఇతడిని గత వారం కాల్చి చంపారు. హఫీజ్ సయిద్ కొడుకును కూడా చంపేశారని టాక్. పాకిస్తానీ సైన్యమే ఇలా కశ్మీరీ ఉగ్రవాదులను చంపేస్తోందన్న ప్రచారం సాగుతోంది.

పాకిస్తాన్ లో టెర్రరిస్టుల వరుస మరణాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.