Prabhas: సినీ హీరోలకు ఫ్యాన్సే బలం. కొన్ని సినిమాలు ఫ్యాన్స్ తోనే హిట్టవుతుంటాయి. స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే కటౌట్లు పెట్టి.. వాటికి దండలు వేసి మరీ ఒక పండుగలా నిర్వహిస్తుంటారు. అలాంటి ఫ్యాన్స్ తమకు దేవుళ్లు అని ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్లు కొనియాడారు. ఈ నేపథ్యంలో ఎవరైనా అభిమాని బయటి ప్రదేశాల్లో కలిసి తనతో ఫొటో దిగుతానంటే వద్దనలేరు. వారితో ఆప్యాయంగా ఉంటారు. కానీ ఇదే అదనుగా తీసుకొని కొందరు ఫ్యాన్స్ అనుచితంగా ప్రవర్తిస్తారు. వారితో మంచిగా ఉంటూనే వెకిలి చేష్టలు చేస్తారు. తాజాగా ఓ అమ్మాయి ప్రభాస్ చెంప చెల్లుమనిపించింది. ఇంతకీ అలా ఎందుకు కొట్టిందో తెలుసా?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి పాన్ వరల్డ్ లో గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్. బాహుబలి సినిమా తరువాత ఆయన రేంజ్ మారిపోయింది. ఇప్పుడు వచ్చే ప్రభాస్ సినిమాలన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. అయినా ప్రభాస్ చేతిలో ఐదారు సినిమాలు ఉన్నాయి. దీంతో ఈ రెబల్ స్టార్ తీరిక లేకుండా ఉంటున్నారు. అయితే తన దగ్గరకు వచ్చే ఏ అభిమాని అయినా ప్రభాస్ అక్కున్న చేర్చుకుంటారు. వారితో ఫొటోలు దిగుతూ సందడి చేస్తారు. షూటింగ్ లో ఉన్నా సరే వారితో కలిసి మాట్లాడుతారు.
ప్రభాస్ కు లేడీ ఫ్యాన్స్ ఎక్కువే. ప్రభాస్ లాంటి వ్యక్తి తన జీవితంలో రావాలని చాలా మంది కోరుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అయితే ప్రభాస్ రియల్ లైఫ్ లో కనిపిస్తే ఎవరైనా ఆగుతారా? అయనను ఒక్కసారైనా ముట్టుకోవాలని అనుకుంటారు. తాజాగా ఓ ఎయిర్ పోర్టులో ప్రభాస్ కనిపించగానే ఓ అమ్మాయి ఎగిరి గంతేసింది. వెంటనే అతని దగ్గరికి వెళ్లి ఫొటోలో దిగింది. అయితే ఆ బేబీ అంతటితో ఆగలేదు. వెంటనే ప్రభాస్ చెంపపై ఒక్కటేసి పరుగులు తీసింది.
ఇలా ఎందుకు చేశావని కొందరు అడగగా.. తనను ముట్టుకోవాలన్న ఆశతోనే అలా చేశానని చెప్పుకొచ్చింది. అయితే ప్రభాస్ మాత్రం తన చెంపపై చేయి వేసుకొని నొప్పిని తగ్గించుకుంటున్నట్లు వీడియోలో కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన కొందరు రియల్ ఫ్యాన్ష్ ను ప్రభాస్ ను కలిసే అవకాశాన్ని కొందరు చెడగొడుతున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. అభిమానం ఉండాలి గానీ.. ఇలా స్థాయికి మించి ఉండకూదని మరికొందరు మెసేజ్ లు పెడుతున్నారు.