China killing Indian donkeys: కాదేదీ చైనీయుల ఆహారానికి అనర్హం అన్నట్టు పరిస్థితి మారింది. కప్పలు , పీతలు, పాములు, ఎలుకలు, సమస్త భూరాశిపై ఉన్న అన్ని జంతువులను వాళ్లు తినేస్తుంటారు. దరిద్రం ఏంటంటే.. ఆఖరుకు గబ్బిలాలు కూడా తింటారు. ఆ గబ్బిలాల వల్లే ప్రపంచానికి కరోనా అంటిందన్న ఆరోపణలు ఉన్నాయి. అది నిగ్గు తేల్చాల్సి ఉంది. చైనీయుల ఆహార, సౌందర్య అలవాట్ల కారణంగానే ప్రపంచంలో కొత్త వైరస్ లు, కొన్ని జాతులు అంతరించి పోతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు భారతదేశంలో గాడిదల సంఖ్య తగ్గిపోవడానికి కూడా చైనీయులే కారణమంటే నమ్మగలరా? కానీ ఇది నిజంగా నిజం. దేశంలో గాడిదల సంఖ్య తగ్గడం వెనుక చైనా హస్తం ఉన్నట్లు తాజా అధ్యయనం నిగ్గుతేల్చింది.

బ్రూక్ ఇండియా నిర్వహించిన అధ్యయనంలో షాకింగ్ విషయం బయటపడింది. భారత్ లో గాడిదల సంఖ్య తగ్గడానికి చైనీయులే కారణమని తేల్చింది. గాడిద చర్మం నుంచి తయారు చేసే కొన్ని రకాల ఔషధాలను చైనా సంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు. ఈ ఔషధాలు పలు రకాల రోగాలను నయం చేస్తాయని చైనీయుల నమ్మకం.
Also Read: ఆమె టచ్ తో మహేష్ బాబు పొగరు అణిచివేయబడిందా?
గాడిద చర్మంతో చేసిన ఔషధాలతో ఆయుర్థాయం పెరుగుతుందని.. అలాగే లైంగిక సామర్థ్యం అధికం చేసుకోవచ్చని.. అందాన్ని కాపాడుకోవచ్చని చైనీయులు బలంగా విశ్వసిస్తారు. ఆ నమ్మకమే ఇప్పుడు భారతదేశంలోని గాడిదల ప్రాణాలకు ఎసరు తెచ్చిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
2012 నాటి లైవ్ స్టాక్ లెక్కల ప్రకారం.. దేశంలో సుమారు 3.2 లక్షల గాడిదలు ఉండేవి. 2021 నాటికి వాటి సంఖ్య 61.23శాతం తగ్గిపోయి 1.2 లక్షలకు చేరుకున్నాయి. ఒక రకం జంతువుల జనాభా ఇంతగా పడిపోవడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.దీంతో బ్రూక్ ఇండియా సంస్థ ఈ గాడిదలపై అధ్యయనం చేపట్టింది. 2019 నుంచి కూడా దేశంలో గాడిదల సంఖ్య తగ్గిపోవడం మరింత అధికమైందని తేలింది. గాడిదల చర్మం ఒలిచి దాన్ని అక్రమ రవాణా చేయడం కారణంగానే దేశంలో గాడిదల సంఖ్య భారీగా తగ్గిపోయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: లక్ష్మీ పార్వతి కంటే ముందే ఆ హీరోయిన్‌ను రెండో పెండ్లి చేసుకోవాలనుకున్న ఎన్టీఆర్.. కానీ!
కరోనా రోగులకు సంప్రదాయ వైద్యం అందించడం చైనాలో సర్వసాధారణం. ఆస్పత్రిలో చికిత్స పొందే వారికి కూడా ఈ సంప్రదాయ ఔషధాలు అందిస్తారు. వీటిలో అధికశాతం గాడిదల చర్మంతో తయారైనవే కావడం గమనార్హం. దీనికోసం వేల గాడిదలను హతమారుస్తున్నారట.. ఇందులో అధికశాతం భారత్ కు చెందిన గాడిదలే కావడం విస్మయం కలిగిస్తోందని బ్రూక్ ఇండియా సంస్థ తేల్చింది.
కరోనా చైనాలో విస్తరించిన తొలి నాళ్లలో ‘డోంగ్ ఇఇ’ అనే చైనా సంస్థ వందల కోట్ల విలువైన సంప్రదాయ ఔషధాలను చైనాలోని పలు ఆస్పత్రులకు విరాళంగా అందజేసింది. దీని కోసం ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా నుంచి గాడిదల చర్మాలను చైనాకు అక్రమంగా తరలించారని తేలింది. చైనాలో జంతువుల మార్కెట్ మూసివేయడంతో విదేశాల నుంచి అక్రమ రవాణా మరింత ఎక్కువైంది.
Also Read: ఆ విషయంలో నేను సిగ్గుపడను – అనసూయ
ఈ క్రమంలోనే కెన్యాలో గాడిదల సంఖ్య విపరీతంగా పడిపోయింది. ఇన్ ఫ్లూయెంజా సోకిన గాడిదలను చంపి, వాటి చర్మాలను ఒలిచివేసి అక్రమ రవాణా చేయడం వల్ల వ్యాధులు కూడా విస్తరించినట్లుగా గుర్తించారు. గాడిద వ్యర్థాలను విచ్చలవిడిగా పడివేయడంతో పలు దేశాల్లో వ్యాధులు విస్తరించినట్లు తేలింది. ఇలా చైనీయుల దాహానికి గాడిదల ప్రాణాలు పోవడమే కాదు.. ప్రపంచానికి దుర్గతి పట్టింది. కొత్త వ్యాధులు సంక్రమించాయి. భారత్ లోనూ గాడిదల జనాభా అంతరించిపోయింది.