https://oktelugu.com/

Kalavathi Song Making Video: కళావతి మేకింగ్‌ కోసం మహేష్ – కీర్తి చిరు నవ్వులు

Kalaavathi Song Making Video: సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ ‘సర్కారు వారి పాట’ నుంచి లవ్ సాంగ్ కళావతి అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం ఒక ఊపు ఊపేస్తోంది. ఈ కళావతి సాంగ్‌ యూట్యూబ్‌లో నెం-1గా ట్రెండ్‌ అవుతోంది. మహేష్ సూపర్‌ స్టైలిష్‌ డ్యాన్స్‌తో పాటు కీర్తి సురేష్‌ అభినయాన్ని సినీ అభిమానులు బాగానే ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో కళావతి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 19, 2022 / 10:46 AM IST
    Follow us on

    Kalaavathi Song Making Video: సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ ‘సర్కారు వారి పాట’ నుంచి లవ్ సాంగ్ కళావతి అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం ఒక ఊపు ఊపేస్తోంది. ఈ కళావతి సాంగ్‌ యూట్యూబ్‌లో నెం-1గా ట్రెండ్‌ అవుతోంది. మహేష్ సూపర్‌ స్టైలిష్‌ డ్యాన్స్‌తో పాటు కీర్తి సురేష్‌ అభినయాన్ని సినీ అభిమానులు బాగానే ఎంజాయ్‌ చేస్తున్నారు.

    Kalavathi Song

    ఈ క్రమంలో కళావతి సాంగ్‌ మేకింగ్‌ వీడియోను చిత్రబృందం ఇన్‌ స్టాగ్రామ్‌లో పంచుకుంది. కీర్తి, మహేష్‌ల మధ్య సరదా సరదాగా సాగిన చిత్రీకరణలో, మహేష్‌ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ కనిపించారు. వీడియో ఇక్కడ చూడొచ్చు. కాగా ఇప్పటి వరకూ 24 మిలియన్ వ్యూస్ ను సాధించింది. పైగా, 982 కే కి పైగా లైక్స్ ను సాధించి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

    Also Read:  ఊర మాస్ లుక్‌ లో బాలయ్య.. మళ్ళీ ఫ్యాన్స్ కు పూనకాలే

    అన్నట్టు ఈ ‘కళావతి’ పాట టీచర్లకూ పాకింది. ఓ తరగతి గదిలో ఇంటర్ విద్యార్థులకు కెరీర్ గురించి వివరిస్తున్న లెక్చరర్.. కళావతి పాటను ఉదాహరణగా తీసుకున్నారు. మంచి ఉద్యోగాలు వస్తే జీతాలు.. ‘ఒక వందో, ఒక వెయ్యో, ఒక లక్షో..’ అంటూ వివరించారు. ‘కళావతి అని కాదు సరస్వతి.. సరస్వతి’ అని పాడుకోవాలని విద్యార్థులకు హితబోధ చేశారు.

    ప్రస్తుతం ఈ వీడియో కూడా నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఈ సినిమాని మే 12, 2022 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఏది ఏమైనా ఈ ‘కళావతి’ సాంగ్ లో మహేష్ బాబు, కీర్తి సురేష్ జంట కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది.

    Also Read:  ఆర్తి అగ‌ర్వాల్ చ‌నిపోయాక చెల్లెలు అదితి ప‌రిస్థితి ఇలా అయిపోయిందేంటి..?

    Tags