Chiranjeevi and Venkatesh : మెగాస్టార్ చిరంజీవి గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. ఇప్పటికీ ఆయన యంగ్ హీరోలకు పోటీని ఇచ్చే విధంగా సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు అంటే ఆయనకి సినిమాల మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి ప్రేక్షకుడిని కదిలించే విధంగా అతని సినిమాలైతే ఉంటాయి. మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయంగ్ ను సంపాదించుకున్న నటుడు కూడా తనే కావడం విశేషం… ఇక విక్టరీ వెంకటేష్ లాంటి నటుడు సైతం ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్ కి రప్పించడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు.
అతని సినిమా వచ్చిందంటే చాలు ఫ్యామిలీ మొత్తం థియేటర్ కి వచ్చి ప్రశాంతంగా సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెంట్ అయితే ప్రేక్షకులకు కలిగించాడు. అలాంటి నటుడు వైవిధ్యభరితమైన సినిమాలను చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తుండటం విశేషం… చిరంజీవి, వెంకటేష్ లు ఈ సంక్రాంతికి వచ్చిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాలో కలిసి నటించారు.
అంతకంటే ముందే వీళ్ళిద్దరు ఒక సినిమాలో కలిసి నటించాల్సింది కానీ అది పట్టాలెక్కలేదు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వీళ్ళిద్దరిని హీరోలుగా పెట్టి ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా చేయాలని వెంకటేష్ వాళ్ల ఫాదర్ రామానాయుడు అనుకున్నాడు. ఏమైందో తెలీదు కానీ మొత్తానికైతే ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. మన శంకర్ వరప్రసాద్ సినిమాలో వీళ్ళిద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపించడం చూసిన మెగాస్టార్ అభిమానులు, వెంకటేష్ ఫ్యాన్స్ సైతం ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సీనియర్ హీరోలు ఇద్దరు వాళ్ళకంటూ ఒక గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఇక ఇప్పటికీ వాళ్ళకంటూ ఒక స్టాండర్డ్ ని ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతున్నారు అంటే మామూలు విషయం కాదు. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి ఉన్న ఈ నటులు రాబోయే సినిమాలతో పాన్ ఇండియాలోకి అడుగు పెట్టి అక్కడ కూడా తమ సత్తా చాటాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది…
