https://oktelugu.com/

Ram Charan Tweet: చరణ్ ఎమోషనల్ ట్వీట్ పై ప్రశంసల వర్షం

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి అర్ధాంగి కొణిదెల సురేఖ నిన్న పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆచార్య సెట్స్ పై కొణిదెల సురేఖ ఉన్నప్పటి ఫొటోను పంచుకున్నారు. ట్విట్టర్ లో ఈ పిక్ పంచుకున్న రామ్ చరణ్.. “నువ్వు అర్థం చేసుకున్నంతగా నన్ను మరెవ్వరూ అర్థం చేసుకోలేరు.. హ్యాపీ బర్త్ డే మా” అంటూ భావోద్వేగ భరితంగా స్పందించిన సంగతి తెలిసిందే. కాగా తన తల్లి జన్మదినం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 19, 2022 / 10:54 AM IST
    Follow us on

    Ram Charan: మెగాస్టార్ చిరంజీవి అర్ధాంగి కొణిదెల సురేఖ నిన్న పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆచార్య సెట్స్ పై కొణిదెల సురేఖ ఉన్నప్పటి ఫొటోను పంచుకున్నారు. ట్విట్టర్ లో ఈ పిక్ పంచుకున్న రామ్ చరణ్.. “నువ్వు అర్థం చేసుకున్నంతగా నన్ను మరెవ్వరూ అర్థం చేసుకోలేరు.. హ్యాపీ బర్త్ డే మా” అంటూ భావోద్వేగ భరితంగా స్పందించిన సంగతి తెలిసిందే.

    ramcharan, surekha, chira

    కాగా తన తల్లి జన్మదినం నాడు ప్రత్యేక ఫొటోని పంచుకున్న రామ్ చరణ్ పై మెగా ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేస్తున్నారు. తన తల్లి సురేఖ పుట్టినరోజు సందర్భంగా రామ్‌చరణ్ విషెస్ తెలిపిన విధానం అద్భుతం అని.. పైగా త్వరలో రాబోతున్న ఆచార్య షూటింగ్‌ లో తన తల్లిదండ్రులతో దిగిన ఫొటోను ట్విట్టర్‌లో చరణ్ షేర్ చేసి.. గొప్ప కొడుకు అనిపించుకున్నాడు అని మెగా ఫ్యాన్స్ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

    Also Read:  పేరు లేద‌నే అల‌క‌బూనిన కేసీఆర్ః వివ‌ర‌ణ ఇచ్చిన జీయ‌ర్ స్వామి

    ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు డిజిటల్ వేదికపై ఉర్రూతలూగించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్.. ఓ హాలీవుడ్ వెబ్‌సిరీస్‌ను రీమేక్ చేస్తోందట. అలాగే ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రానుంది.

    అన్నట్టు ఈ చిత్రం రెండో షెడ్యూల్ షూటింగ్ ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంది కూడా. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నాడు. చరణ్ కి జోడీగా కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ రహమాన్ మ్యూజిక్ అందిచబోతున్నాడు.

    Also Read: ఆర్తి అగ‌ర్వాల్ చ‌నిపోయాక చెల్లెలు అదితి ప‌రిస్థితి ఇలా అయిపోయిందేంటి..?

    Tags