PM Modi : భారత్ పేదరికం నిర్మూలనలో వేసిన అడుగులు, జర్నీని చూసినట్టైతే ఇదో అద్భుతమైన కేస్ స్టడీగా చెప్పొచ్చు. ప్రపంచంలోనే గొప్ప విజయంగా చెప్పొచ్చు. భారత్ ఇక ఏమాత్రం పేదరిక దేశం కాదు. ఎంత సేపటికి అదానీ పెరిగాడు.. అంబానీ పెరిగాడని మాట్లాడుకుంటాం తప్పితే.. అదే టైంలో మధ్యతరగతి వర్గం కూడా గణనీయంగా పెరిగిన వైనాన్ని ఎవరూ గుర్తించవద్దు.
ఇప్పటికే 15వేల డాలర్ల ఆదాయం కలిగిన వ్యక్తులు భారత్ లో 6 కోట్ల మంది ఉన్నారు. 2030 నాటికి 12 లక్షల ఆదాయం కలిగిన వారంతా 10 కోట్లకు చేరబోతున్నారు. మధ్యతరగతి కూడా ఏ పద్ధతిలో అభివృద్ధి చెందుతుందో అర్థం చేసుకోవచ్చు.
అంతకన్నా ముఖ్యమైనది మోడీ హయాంలో గత 9 ఏళ్లలో ప్రజలు ఎలా బయటపడగలిగారు.. ఒకవైపు రెండేళ్లు కోవిడ్ మహమ్మరితో ప్రపంచం మొత్తం వెనక్కిపోయిన పరిస్థితుల్లో భారత్ ఏ విధంగా పేదరికం నుంచి బయటపడింది.? ఆర్థిక వ్యవస్థ నుంచి ఎలా బయటపడింది..? ప్రపంచంలోనే అందరూ ఆసక్తిగా వేస్తున్న ప్రశ్న.
కరోనా మహమ్మారి వచ్చినా మోడీ పేదల్ని ఎలా కాపాడ గలిగాడు? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.