Skoda Car: భారత్ లో స్కోడా కొత్త ఈ- కారు.. అదిరిపోయే ఫీచర్స్.. లాంచింగ్ ఎప్పుడంటే?

స్కోడా ఎన్యాక్ ఐవీ అప్డేట్ ఫీచర్స్ తో పాటు అద్భుతమైన పవర్ తో ఆకట్టుకోనుంది. ఇందులో 32kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. సింగిల్ మోటార్ రియర్ వీల్ సెటప్ ను అమర్చారు.

Written By: Chai Muchhata, Updated On : January 16, 2024 3:25 pm

Skoda Car

Follow us on

Skoda Car: దేశంలో కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. కొత్త మోడళ్లు మార్కెట్లోకి ఏది వచ్చినా వినియోగదారులు ఆదరిస్తున్నారు. గత ఏడాదిగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరీ పెరిగింది. దీంతో చాలా కంపెనీలు సైతం ఈయూ ల ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ తరుణంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న స్కోడా కంపెనీ భారత్ లో కొత్త మోడల్ ను లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది. స్కోడా ఎన్యాక్ ఐవీ పేరుతో ఈయూ ను తీసుకొస్తుంది. వోక్స్ వ్యాగన్ గ్రూపులోని ఎంఈబీ ఎలక్ట్రిక్ ప్లాట్ ఫాం ఆధారంగా తయారైన ఈ కారును మార్చిలో లాంచ్ చేయనున్నారు. ఈ కారు వివరాల్లోకి వెళితే..

స్కోడా ఎన్యాక్ ఐవీ అప్డేట్ ఫీచర్స్ తో పాటు అద్భుతమైన పవర్ తో ఆకట్టుకోనుంది. ఇందులో 32kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. సింగిల్ మోటార్ రియర్ వీల్ సెటప్ ను అమర్చారు. 282 బీహెచ్ పీ పవర్ ను కలిగి ఉన్న ఈ కారు 28 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్ అవుతుంది. ఇలాంటి కారు భారత్ లో హ్యుందాయ్ ఐయనిక్ 5, కియా ఈవీ 6 ఉన్నాయి. ఇప్పుడు వీటికి పోటీ ఇచ్చేందుకు ఎన్యాక్ ఐవీ రెడీ అవుతోంది. 2024 కొత్త ఏడాదిలో మార్చిలో దీనిని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఆకర్షణీయమైన లుక్ లో ఉన్న ఎన్యాక్ ఐవీ ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్ ను కలిగి ఉంది. ఇది 2,765 ఎంఎం వీల్ బేస్ ను కలిగి ఉంది. సిగ్నేచర్ గ్రిల్ డిజైన్ ను కలిగి ఉంది. హెడ్ ల్యాంపులు, టెయిల్ ల్యాపులు తో పాటు డ్రైవర్ డిస్ ప్లే , 15 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. లేటేస్ట్ క్యాబిన్ డిజైన్ తో ఆకర్షిస్తున్న ఎన్యాక్ ఐవీ లో కావాల్సినంతా స్పేస్ ఉంది. ఇందులో బూట్ స్పేస్ మరీ ఎక్కువగా ఉండడం విశేషం.

ఎలక్ట్రిక్ కార్ల వినియోగం రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో ప్రముఖ కంపెనీ స్కోడా కొత్త ఈవీని తీసుకురావడం ఆసక్తిగా మారింది. అంతేకాకుండా ఇప్పటికే దీనిని భారతీయ రోడ్లపై పరీక్షిస్తున్నారు. హ్యుందాయ్ వెర్నా సెడాన్ బాడీ కిట్ తో సవరించినట్లు తెలుస్తోంది. దాదాపు 585 లీటర్ల స్టోరేజ్ కెపాసిటీని కలిగిన ఇందులో రక్షణ కోసం 9 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. అయితే రిలీజ్ అయ్యాక ఈ కారు ఎలా అలరిస్తుందో చూడాలి.