గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. వేర్వేరు అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపుతుండగా దేశ రాజధాని న్యూ ఢిల్లీలో ఈరోజు ఒక్కరోజే బంగారం ధర ఏకంగా 717 రూపాయలు తగ్గడం గమనార్హం. ధర తగ్గడంతో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 46,102 రూపాయలుగా ఉంది. బంగారం ధర తగ్గగా వెండి ధరలు సైతం తగ్గడం గమనార్హం. కిలో వెండి ధర ఏకంగా 1,274 రూపాయలు తగ్గి రూ.68,239కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గగా దేశీయ మార్కెట్లో సైతం బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం గమనార్హం. దేశంలో నగల వ్యాపారుల నుంచి డిమాండ్ అంతకంతకూ తగ్గుతుండటంతో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు 8 నెలల కనిష్టానికి బంగారం ధర చేరడంతో బంగారం కొనుగోలు చేసేవాళ్లకు పసిడి కొనుగోలుకు ఇదే సరైన సమయమని చెప్పవచ్చు.
అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర 1,786 డాలర్లకు చేరగా ఔన్సు వెండి ధర 27.10 డాలర్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం బంగారంపై కస్టమ్స్ సుంకం తగ్గించడంతో బంగారం ధరలు అంతకంతకూ తగ్గడం గమనార్హం. మార్కెట్ నిపుణులు సైతం బడ్జెట్ పై దిగుమతి సుంకాలు తగ్గించడం వల్లే ధరలు తగ్గుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా పసిడి ధర రెండు వారాల కనిష్ట స్థాయికి పతనం కావడం గమనార్హం.
బాండ్ ఈల్డ్ పెరగడం వల్ల కూడా బంగారం ధర తగ్గిందని చెప్పవచ్చు. బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటూ ఉండటం వల్ల కూడా బంగారం ధరలపై ప్రతికూల ప్రభావం పడుతోందని తెలుస్తోంది.